twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎపిసోడ్ 2: చిచ్చుపెట్టిన బిగ్ బాస్... ఏకమైన సెలబ్రిటీలు, సామాన్యులు జైలుకు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Bigg Boss 2 Telugu : Contestants Elimination Nominate Process

    నాని హోస్ట్‌గా బిగ్ బాస్ 2 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 106 రోజుల పాటు జరిగే ఈ షోలో పాల్గొనేందుకు మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి ఎంటరయ్యారు. బిగ్ బాస్ షో అంటేనే కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు రాజేసి ప్రేక్షకులకు వినోదం పంచడం. ఇందులో భాగంగా తొలి రోజే పోటీ దారుల మధ్య చిచ్చు పెట్టేశాడు బిగ్ బాస్. అంతా కలిసి ఇద్దరిని జైల్లోకి పంపాలని, ఎవరిని పంపాలో మీరే డిసైడ్ చేసుకోండి అంటూ చెప్పేశాడు. దీంతో ఏకమైన సెలబ్రిటీలు.... ఇద్దరు సామాన్యులను జైల్లోకి పంపేందుకు డిసైడ్ అయ్యారు. దీంతో సామాన్యుల కేటగిరీలో బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన, నూతన్ నాయుడు బలయ్యారు.

    దోమలు, బొద్దింకలు, ఎలుకల మధ్య గడిపిన...సంజన, నూతన్

    దోమలు, బొద్దింకలు, ఎలుకల మధ్య గడిపిన...సంజన, నూతన్

    బిగ్ బాస్ ఇంట్లో జైలు ఆరుబయట ఏర్పాటు చేయబడి ఉంది. రాత్రంతా నూతన్ నాయుడు, సంజన ఆ జైల్లో గడిపారు. దోమలు, బొద్దింకలు, ఈగల మధ్య ఇబ్బంది పడ్డామని, ఎలుకలు కూడా వచ్చాయని సంజన ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో బెడ్ కూడా కంఫర్టుగా లేదని తెలిపారు.

    వాదనకు దిగిన సంజన

    వాదనకు దిగిన సంజన

    జైల్లో ఉన్న తమపై జాలి చూపేందుకు వచ్చిన సెలబ్రిటీలతో సంజన వాదనకు దిగింది. సామాన్యులమని తమ పట్ల కర్కశంగా ప్రవర్తించారని మండి పడింది. జైల్లో ఉన్నంత సేపు సంజన బెడ్ మీద పడుకుని ఉండటంతో.... అందులో ఉన్న మరో సామాన్యుడు రాత్రంతా నిలబడి ఉండిపోయారు.

    కంటెస్టెంట్స్ సపోర్టుతో జైలు నుండి బయటకు వచ్చిన నూతన్ నాయుడు

    కంటెస్టెంట్స్ సపోర్టుతో జైలు నుండి బయటకు వచ్చిన నూతన్ నాయుడు

    సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇంటి సభ్యులను పిలిచిన బిగ్ బాస్ ఒకరిని జైలు నుండి బయకు తెచ్చే అవకాశం ఇంటి వారికి కల్పించారు. జైల్లో ఉన్నంత సేపు నిలబడే ఉన్న నూతన్ నాయుడుకు ఎక్కువ మంది ఇంటి సభ్యులు సపోర్ట్ చేయడంతో ఆయన జైలు నుండి బయటకు వచ్చారు.

    ఎవరినీ ఇంప్రెస్ చేయడానికి రాలేదన్న నూతన్

    ఎవరినీ ఇంప్రెస్ చేయడానికి రాలేదన్న నూతన్

    రాత్రంతా మీరు జైల్లో నిల్చుని ఉండటం తమకు నచ్చలేదని, అందుకే మిమ్మల్ని అంతా కలిసి బయటకు తీసుకొచ్చామని కిరీటి దామరాజు..... నూతన్ నాయుడును ఉద్దేశించి అనగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి తాను బిగ్ బాస్ కు రాలేదని కాస్త సీరియస్‌గా చెప్పారు నూతన్.

    లెటర్లు పంపిన బిగ్ బాస్

    లెటర్లు పంపిన బిగ్ బాస్

    సాయంత్రం 5 గంటలకు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ కొన్ని లెటర్లు పంపారు. అందరికీ ఖాళీ కార్డులు రాగా... తనీష్, కౌశల్, సామ్రాట్, భాను శ్రీలకు మాత్రం వేరే కార్డులు వచ్చాయి. తనీష్ కార్డుపై స్విమ్మింగ్ పూల్ నుండి స్పూన్ తో నీళ్లు తోడి బకెట్ నింపాలి అని రాసి ఉంది. భానుశ్రీకి రుచికరమైన కేక్ బహుమతిగా వచ్చింది. సామ్రాట్ నెక్ట్స్ కెప్టెన్ కంటెస్టెంట్ అని రాసి ఉంది. కౌశల్‌కు జైలు ఫ్రీ కార్డు వచ్చింది.

    స్వార్థంగా ప్రవర్తించిన కౌశల్

    స్వార్థంగా ప్రవర్తించిన కౌశల్

    జైలు ఫ్రీ కార్డు ఒకసారి మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుందని...దీన్ని సంజనను జైలు నుండి బయటకు తీసుకురావడానికి వాడుతావా? నీ కోసం దాచుకుంటావా? అని బిగ్ బాస్ అడగ్గా నా కోసమే దాచుకుంటానని కౌశల్ తెలిపారు. దీంతో కౌశల్ మీద స్వార్థపరుడు అనే ముద్ర పడినట్లయింది.

    మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలు

    మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలు

    ఇంటి నుండి బయటకు పంపడం కోసం మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. యాంకర్ శ్యామలను బిగ్ బాస్ మొదట కన్ఫెషన్ రూముకు పిలిచి అడగ్గా... కిరీటి, తనీష్ పేర్లు చెప్పింది. వారు ఇంట్లో పనులను షేర్ చేసుకోవడం లేదని తెలిపింది.

    సామ్రాట్

    సామ్రాట్

    సామ్రాట్‌ను పిలిచి అడ్డగా...సునైన, గణేష్ పేర్లు చెప్పాడు. వీరిద్దరూ గేమ్‌లో యాక్టివ్‌గా లేరని వెల్లడించారు.

    సునైన

    సునైన

    సునైనను పిలిచి అడ్డగా.... అమిత్, గీతా మాధురి పేర్లు చెప్పింది. అమిత్ ఓవర్ కేరింగ్ తీసుకుంటున్నాడని, గీతా మాధురి యాక్టింగ్ చేస్తున్నట్లు అనిపించిందని తెలిపారు.

    నూతన్ నాయుడు

    నూతన్ నాయుడు

    నూతన్ నాయుడును పిలిచి అడ్డగా....సంజన, కిరీటి పేర్లు చెప్పాడు. సంజన్ అగ్రెసివ్ గా ఉందని, చెప్పేది అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. కిరిటీ తనేదో ఊహించుకుంటూ అందరికీ తన అభిప్రాయాలు ఆపాదిస్తున్నారని తెలిపారు.

    అమిత్

    అమిత్

    అమిత్‌ను పిలిచి అడగ్గా.... దీప్తి సునైన, గణేష్ పేర్లు చెప్పాడు. వారితో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించాను కానీ వారి నుండి రెస్పాన్స్ లేదని అమిత్ తెలిపారు.

    దీప్తి నల్లమోతు

    దీప్తి నల్లమోతు

    దీప్తి నల్లమోతును పిలిచి బిగ్ బాస్ అడ్డగా.... సునైన, కౌశల్ పేర్లు చెప్పారు.

    బాబు గోగినేని

    బాబు గోగినేని

    బాబు గోగినేనిని పిలిచి అడ్డగా,..... సంజన, నూతన్ నాయుడు పేర్లు చెప్పారు. సంజనలో పగ, కసి ఉందని, ఆమె బిగ్ బాస్‌కు పనికి రాదన్నారు. నూతన్ నాయుడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.

    తేజస్వి

    తేజస్వి

    తేజస్విని పిలిచి అడ్డగా... సునైన, గణేష్ పేర్లు చెప్పింది. వారు సరిగా పార్టిసిపేట్ చేయడం లేదని తెలిపారు.

    తనీష్

    తనీష్

    తనీష్‍‌ను పిలిచి అడ్డగా.... కౌశల్, గణేష్ పేర్లు చెప్పారు. వారిద్దరూ ఎవరితోనూ కలవడం లేదని వెల్లడించారు.

    కౌశల్

    కౌశల్

    కౌశల్‌ను పిలిచి అడ్డగా..... కిరీటి, సునైన పేర్లు చెప్పారు. కిరిటీ ఓవర్ కమాండింగ్, ఎవరూ చెప్పినా వినిపించుకోని తనం ఉందని తెలిపారు. సునైనకు బిగ్ బాస్ లో ఉండేంత మెచ్యూరిటీ లేదన్నారు.

    భాను శ్రీ

    భాను శ్రీ

    భానుశ్రీని పిలిచి ఈ విషయమై అడ్డగా....కిరిటి నటిస్తున్నాడు. తనీష్ ఏపని చేయకుండా ఉండటం నచ్చలేదంటూ వారిద్దరి పేర్లు చెప్పింది.

    కిరీటి

    కిరీటి

    కిరిటీ దామరాజును పిలిచి అడగ్గా... సునైన, నూతన్ నాయుడు పేర్లు చెప్పారు. వీరిద్దరి వ్యవహారం తనకు నచ్చలేదన్నారు.

    వీరంతా....

    వీరంతా....

    గణేష్ ను పిలిచి అడ్డగా... సునైనా, కౌశల్ పేర్లు చెప్పాడు. రోల్ రైడాను అడ్డగా... సంజన, నూతన్ నాయుడు పేర్లు చెప్పాడు. గీతా మాధురిని పిలిచి అడ్డగా..... తేజస్వి. గణేష్ పేర్లు చెప్పారు. సంజనను అడ్డగా....రోల్ రైడా, తేజస్వి పేర్లు చెపింది.

    నామినేట్ అయింది వీరే..

    నామినేట్ అయింది వీరే..

    బిగ్ బాస్ ఇంటి సభ్యుల నుండి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం.... ఎక్కువ ఓట్లు పడిన సునైన, గణేష్, కిరీటి, కౌశల్, నూతన్, సంజన ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఇంటి నుండి బయటకు వెళతారు అనేది వచ్చే వారం నాని తేల్చనున్నాడు. ఎలిమినేషన్ అనేది ప్రేక్షకులు వేసే ఓట్లపై ఆధారపడి ఉంటుంది.

    English summary
    Bigg Boss 2 Telugu Day 1 details. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X