twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 2 మూడో రోజు: పనివాడిగా మారిన బాబు గోగినేని!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu : Babu Gogineni Argument With House Members

    బిగ్ బాస్ 2లో మంగళవారం ప్రసారమైన షోలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సునైన, గణేష్, కిరీటి, కౌశల్, నూతన్, సంజన ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎలిమినేషన్ నుండి తప్పించుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. రెండు రోజుల పాటు జైల్లో గడిపిన సంజనకు బిగ్ బాస్ విముక్తి కలిగించాడు. సంజన ఇంట్లోకి రాగానే 16 మంది సభ్యులను రెండుగా విభజించాడు బిగ్ బాస్.

    సంజన టీంకు యజమానుల హోదా

    సంజన టీంకు యజమానుల హోదా

    జైలు నుండి బయటకు వచ్చిన సంజనకు తన టీంను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. దీంతో ఆమె తన జట్టుకు తేజస్వి, గీతా మాధురి, సునైనా, గణేష్, కౌశల్, తనీష్, సామ్రాట్‌లను ఎంచుకుంది. వీరికి బిగ్ బాస్ యజమానుల హోదా కల్పించాడు.

    తొలి లగ్జరీ బడ్జెట్ టాస్క్

    తొలి లగ్జరీ బడ్జెట్ టాస్క్

    కిరిటీ దామరాజును కన్‌ఫెషన్ రూముకు పిలిచిన బిగ్ బాస్..... తొలి లగ్జరీ టాస్క్ అప్పగించాడు. దీనికి ‘చెప్పండి ప్రభు' అనే పేరు పెట్టారు. సేవకుల టీంలో ఉన్నవారంతా యజమానులు చెప్పినట్లు వినాలని, వారు ఏ పని చెప్పినా చేయాలని సూచించాడు. ఇంటి పనులే కాకుండా తమకు నచ్చిన పనులు చేయించుకునే హక్కు యజమానులకు బిగ్ బాస్ ఇచ్చాడు.

    దారుణమైన నిబంధనలు

    దారుణమైన నిబంధనలు

    సేవకుల టీంలో ఉన్న వారికి బిగ్ బాస్ దారుణమైన నిబంధనలు పెట్టారు. సేవకులు అరటాకుల్లో మాత్రమే తినాలని, మళ్లీ తినాలనిపిస్తే అదే ఆకును శుభ్రం చేసుకోవాలని బిగ్ బాస్ సూచించారు. అంతే కాదు సేవకులు యజమానులతో కలిసి బెడ్రూంలో పడుకోకూడదని సూచించాడు.

    రకరకాల పనులు చేయించుకున్న యజమానులు

    రకరకాల పనులు చేయించుకున్న యజమానులు

    యజమానుల టీం సేవకులతో తమకు ఇష్టమొచ్చిన పనులు చేయించుకున్నారు. వారితో డాన్స్ కూడా చేయించారు. సామ్రాట్... అమిత్‌తో హెడ్ మసాజ్ చేయించుకోగా, కశల్... భానుశ్రీతో బాడీ మసాజ్ చేయించుకున్నాడు.

    నేను బానిసను కాదు అంటూ తిరగబడిన బాబు గోగినేని

    నేను బానిసను కాదు అంటూ తిరగబడిన బాబు గోగినేని

    జైలు నుండి విడుదలై కసిగా ఉన్న సంజన.... సేవకుల టీం మీద తన కసి చూపించింది. పనివాళ్ల టీంలో ఉన్న బాబు గోగినేనిని పిలిచి తనకు హెడ్ మసాజ్ చేయాల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ పని చేయడం నుంచి బాబు గోగినేని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తన డ్యూటీ అయిపోయిందని ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించగా.... చేసి తీరాల్సిందే అంటూ సంజన పట్టుబట్టింది. దీంతో బాబు గోగినేని తిరగబడ్డారు. తనకు నచ్చని పని చేయనని, పని వారికి కూడా హక్కులుంటాయని, మమ్మల్ని బానిసలుగా చూసే మీకు హక్కు లేదు.... కావాలంటే నాకు డిస్ లైక్ వేసుకోండి అంటూ తేల్చి చెప్పాడు

    సంజన అతి చేస్తోంది అంటూ...

    సంజన అతి చేస్తోంది అంటూ...

    అయితే సంజన అతి చేస్తోందంటూ ఆమె టీంలోనే అసంతృప్తి వ్యక్తం అయింది. ఆమె పని వాళ్లను బాగా ఇబ్బంది పెడుతోందంటూ కొందరు సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తేజస్వి, సంజన మధ్య ఈ విషయంలో వాగ్వివాదం జరిగింది.

    English summary
    Bigg Boss 2 Telugu Day 3 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X