బిగ్ బాస్ డే 4: జంబలకిడి పంబ... పవన్ డైలాగుతో అదరగొట్టిన టీవీ 9 యాంకర్!
Recommended Video

బిగ్ బాస్ రెండో సీజన్ రోజులు గడుస్తున్న కొద్దీ ఆసక్తికర టాస్క్‌లతో ముందుకు సాగుతోంది. యజమానుల టీం సేవకుల టీంతో తమ పనులు చేయించుకోవడంతో పాటు ప్రేక్షకలను వినోదం పంచేందుకు జంబలకిడి పంబ బ్యూటీ పజెంట్ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో భాగంగా సేవకుల టీం సభ్యుల్లో ఆడవారు మగవేషాల్లో, మగవారు ఆడ వేషాల్లో ర్యాంప్ షో నిర్వమించారు. అయితే బాబు గోగినేని మాత్రం ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు నిరాకరించారు. తాను ఫ్యాషన్ షోలకు వ్యతిరేకమని, ఇందులో పాల్గొబోను అని తప్పుకున్నారు.

పవన్ కళ్యాణ్ డైలాగులో అదరగొట్టిన టీవీ 9 యాంకర్
జంబలకిడి పంబ ఫ్యాషన్ షోలో పాల్గొన్న టీవీ 9 యాంకర్ దీప్తి నల్లమోతు పవన్ కళ్యాణ్ మాదిరిగా డైలాగులు కొట్టి ఆకట్టుకుంది. ‘ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు.. కానీ గుండెల్లో కావాల్సినంత ధైర్యం ఉంది' అంటూ ఆమె అదరగొట్టారు.

విజేతగా నిలిచిన నూతన్ నాయుడు
యజమానుల టీం ఆర్గనైజ్ చేసిన జంబలకిడి పంబ ఫ్యాషన్ షోలో పాల్గొన్న సేవకుల టీంలో...... అద్భుత ప్రదర్శన ఇచ్చిన నూతన నాయుడును విజేతగా నిలిచాడు. ఇందుకు బహుమతిగా యజమానుల టీం అతడికి మూడు గంటలు విశ్రాంతి ఇచ్చారు.

బాబు గోగినేనిపై నిందలు
ఫ్యాషన్ షోలకు తాను వ్యతిరేకం అని చెప్పిన బాబు గోగినేని ఒక్కడే ఒంటరిగా బిగ్ బాస్ ఇంట్లో ఉండి పోయాడు. అయితే ఫ్యాషన్ షో ముగిసిన అనంతరం ఇంటిలోనికి వచ్చిన సభ్యులు రైస్ కుక్కర్ ప్లగ్ పీకి ఉండటం చూసి ఆగ్రహానికి గురయ్యారు. ఈ పని చేసింది బాబు గోగినేని అయుంటాడేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

చిల్లర పనులు చేసే రకం కాదన్న బాబు
రైస్ కుక్కర్ ప్లగ్ పీకేసి.... అన్నం అవ్వకుండా ఇబ్బంది పెట్టాలనే చిల్లర పనులు చేసే రకం తాను కాదు అంటూ... తనపై వచ్చిన ఆరోపణలకు బాబు గోగినేని విరవణ ఇచ్చారు.

సీన్ రివర్స్
కొంత గంటల సమయం గడిచిన తర్వాత బిగ్ బాస్ సీన్ రివర్స్ చేశాడు. యజమానులను సేవకులుగాను, సేవకులను యజమానులుగానూ మార్చాడు. దీంతో యజమానులుగా మారిన సేవకులు... ఒక పద్దతి ప్రకారం వారితో పనులు చేయించుకోవాలని డిసైడ్ అయ్యారు.

తేజస్వికి మౌన వ్రతం శిక్ష
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వాగుడు కాయగా పేరు తెచ్చుకున్న తేజస్వికి... యజమానుల టీం సరదాగా మౌన వ్రతం శిక్ష వేసింది. ఇందులో భాగంగా ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం సైగలతోనే ఇతరులతో మాట్లాడాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











