బిగ్ బాస్ 2 ఐదో రోజు హైలెట్స్: ఏడ్చేసిన తేజస్వి... బోర్ కొట్టించిన గొడవలు!

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Luxury Budget Task Ended

బిగ్ బాస్ 2 గురువారం (జూన్ 14)న ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఎలాంటి ఆసక్తికర సంఘటనలు, ఫన్ ఎలిమెంట్స్ లేక పోగా ఇంటి సభ్యులు గొడవ పడ్డ తీరు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఒక్కటంటే ఒక్క ఆసక్తికర మూమెంట్ కూడా ఈ నాటి షోలో లేక పోవడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాను రాను ప్రేక్షకుల్లో బిగ్ బాస్ 2 మీద ఆసక్తి మరింత తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవరాల్‌గా గురువారం నాటి బిగ్ బాస్ షో ప్రేక్షకుల్లో ఈ రియాల్టీషోపై ఆసక్తి మరింత సన్నగిల్లేలా చేసింది.

ఏడ్చేసిన తేజస్వి

ఏడ్చేసిన తేజస్వి

ఇంటి సభ్యులు కొందరు తనపట్ల ప్రవర్తించిన తీరుపై అసహనంగా ఉన్న తేజస్వి..... ఒకానొక సమయంలో ఏడ్చేసింది. ఏదైనా విషయం ఉంటే తనకు స్ట్రైట్ గా చెప్పాలని, తన వెనక మాట్లాడితే తాను సహించలేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

నూతన్ నాయుడు ఓవరాక్షన్

నూతన్ నాయుడు ఓవరాక్షన్

ఇక నూతన్ నాయుడు ఓవరాక్షన్ చేస్తున్నాడని, తాము అడగకపోయినా ఉచిత సలహాలు, ఫిలాసఫీలు చెబుతూ తమను ఇబ్బంది పెడుతున్నాడని, అనవసరంగా లెక్చర్లు ఇవ్వడం మానుకోవాలని తనీష్, సామ్రాట, తేజస్వి తదితరులు మండి పడ్డారు.

తేజస్వితో గొడవ పడిన సంజన

తేజస్వితో గొడవ పడిన సంజన

ఒకే టీంలో ఉన్న తేజస్వి, సంజన మధ్య అస్సలు పడటం లేదు. తాజాగా వంట చేసే విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. తేజస్వి వంటచేసి తానే అన్ని మార్కులు కొట్టేస్తుందని, తనకూ అవకాశం ఇవ్వాలని సంజన వాదించిన తీరు, దానికి తేజస్వి రియాక్ట్ అయిన తీరు ప్రేక్షకులకు మరింత చికాకు తెప్పించింది.

బిగ్ బాస్‌లో మొదటి టాస్క్ పూర్తి

బిగ్ బాస్‌లో మొదటి టాస్క్ పూర్తి

బిగ్ బాస్ అప్పగించిన మొదటి టాస్క్ ‘చెప్పండి ప్రభు' సంజన టీం, కిరీటి టీం విజయవంతంగా పూర్తి చేశారు. 177 పాయింట్లు కిరిటీ టీం సాధించగా, సంజన టీం 170 పాయింట్లు సాధించింది. ఎక్కువ పాయింట్లు సాధించిన కిరిటీ టీంను బిగ్ బాస్ విజేతగా ప్రకటించాడు.

బోర్ కొట్టించిన గేమ్!

బోర్ కొట్టించిన గేమ్!

ఓవరాల్‌గా గురువారం ప్రసారమైన గేమ్ ప్రేక్షకులకు బోర్ కొట్టింది. రేపు ఈ షో చూడాలనే కొద్ది పాటి ఆసక్తి కూడా హరించే విధంగా ఉంది. ఇప్పటికే నాని హోస్ట్ ఎన్టీఆర్ స్థాయిలో లేదనే విమర్శలు వచ్చాయి, కంటెస్టెంట్స్ ప్రదర్శన కూడా పేలవంగా ఉండటం, బోర్ కొట్టించడంతో బిగ్ బాస్ రెండో సీజన్ చూసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X