షాకింగ్: పూజా, దీప్తిపై ఎలిమినేషన్ కత్తి.. బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్?
బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్ చివర అంకంలోకి ప్రవేశించింది. ఇక నాలుగైదు వారాల్లో ఈ కార్యక్రమానికి తెర పడే అవకాశం ఉంది. ఈ వారం ఎలిమినేషన్‌పై భారీగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఎందుకంటే ఈ సారి నామినేట్ అయిన వారిలో టాప్ కంటెస్టెంట్ కౌశల్, తనీష్, పూజా రామచంద్రన్, దీప్తి నల్లమోతు ఉన్నారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే ఊహాగానం ఓ వైపు.. పూజా రాంచంద్రన్ బయటకు వెళ్లడం ఖాయమనే ఓ వార్త ప్రచారంలో ఉంది.

కౌశల్‌కు భారీగా ఓటింగ్
బిగ్‌బాస్‌లో ఈ వారం నామినేషన్ అయిన వారిలో కౌశల్ టాప్ కంటెస్టెంటెంట్. కౌశల్ ఆర్మీ పేరుతో ఈ షోను భారీగా ప్రభావితం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి నామినేషన్‌లో ఉండటంతో ఈ సారి భారీ ఓట్లతో బయటపడేసేందుకు ఓటింగ్ చేస్తున్నట్టు సమాచారం.
Recommended Video


తనీష్‌కు ఢోకా లేదట
ఇక రెండో సీజన్‌లో మరో బలమైన అభ్యర్థి తనీష్. తనీష్‌కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా నానికి సన్నిహితుడు కావడంతో అతడి ఫ్యాన్స్, తేజస్వి ఫ్యాన్స్ తనీష్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిసింది. కాబట్టి తనీష్ బయటకు వెళ్లే ప్రసక్తి ఉండకపోవచ్చు.

దీప్తి నల్లమోతు ముప్పు?
బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి దీప్తి నామినేషన్ ఏదో ఒక వారం నామినేట్ అవుతూ వస్తున్నారు. కానీ ఎలిమినేషన్ నుంచి సులభంగానే గట్టెక్కుతూ వస్తున్నది. ఈ సారి కూడా దీప్తి నల్లమోతుకు పెద్దగా ముప్పు ఉండకపోవచ్చు. కాబట్టి ఇంక అందరి చూపు పూజా రాంచంద్రన్ వైపే ఉంది.

అందరి చూపు పూజా వైపే
ఇంటిలో అతి బలహీనమైన సెలబ్రిటీ పూజా రాంచంద్రన్. ఇంటి సభ్యులతో సరైన సంబంధాలు లేవు. పైగా భాష అనేది ప్రధానమైన సమస్యగా మారింది. ఇంట్లో చెప్పాలనుకొన్న విషయాన్ని బలంగా చెప్పలేకపోతున్నది. కాకపోతే కొన్ని టాస్కుల్లో బాగా రాణించింది. అయితే ఈ సారి ఎలిమినేషన్స్‌లో పెద్దగా సానుకూలత కనిపించడం లేదు.

ఈ వారం డబుల్ నామినేషన్
ఇాలాంటి విశ్లేషణల నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ కత్తి పూజా రాంచంద్రన్, దీప్తి నల్లమోతుపై వేలాడతున్నది. నూతన్ నాయుడు, శ్యామల డబుల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఈ ఇద్దరు, లేదా వీరిలో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











