నేను మీకు నచ్చక పోయిన పర్లేదంటూ.. బిగ్‌బాస్ భామ హాట్ ఎక్స్‌పోజింగ్
బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్‌కు వచ్చిన క్రేజ్ మరే సీజన్‌కు రాలేదు. కౌశల్ ఆడిన ఆట, అందరూ కలిసి అతడినే టార్గెట్ చేయడం, టాస్క్‌లో భానుతో యాపిల్ గొడవ, తనీష్, దీప్తి సునయన రిలేషన్, తేజస్వీ అరపులు ఇలా ప్రతీది ఒక ప్రత్యేకంగానే నిలిచింది. అందులో భాను, అమిత్ మధ్య ఏర్పడిన స్నేహబంధం అందరికీ గుర్తుండే ఉంటుంది.
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన భానుకు మంచి అవకాశాలే వచ్చాయి. హౌస్‌లో ఉన్నంత వరకు తాను పడిన కష్టాలు, డ్యాన్సర్‌గా ఎదగడానికి చేసిన ప్రయత్నాలు ఇలా అన్నీ చెప్పుకుంటూ తన గతాన్ని అందరికీ పరిచయం చేసింది. తాను సినీ ఇండస్ట్రీలో ఉండాలని ఎంత పట్టుదలగా ఉండేదో వివరించిన సందర్భాలెన్నో.

అలా చెప్పిన భానుకు టాలీవుడ్‌లో మంచి ఆఫర్లే వస్తున్నాయి. అయితే బుల్లితెరపై హోస్ట్‌గా ఆకట్టుకున్న భాను.. కొన్ని షోలను బాగానే నడిపింది. సినిమాల పరంగానూ భానుకు మంచి అవకాశాలే వస్తున్నాయి. రీసెంట్‌గా ఏడు చేపల కథ చిత్రంలో నటించగా.. అది విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం భాను ఈఎమ్ఐ అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. దానికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ ఓ ఫన్నీ కామెంట్ చేసింది. నేను మీకు నచ్చకపోయినా పర్లేదు.. ఎందుకుంటే అందరికి మంచి టేస్ట్ ఉండదు కదా అంటూ కౌంటర్ వేస్తూ.. ఈఎమ్ఐ షూటింగ్ జరుగుతోందంటూ తెలిపింది. దీంతో పాటు షేర్ చేసిన వీడియోలో భానును చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. నడుమునే ఫోకస్ చేస్తూ షూట్ చేసిన ఈ వీడియోను నెటిజన్లు లైకులతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.


Click it and Unblock the Notifications











