‘బిగ్ బాస్ తెలుగు 2’లో పొల్గొనే ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్!

By Bojja Kumar

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌తో 100 రోజుల పాటు షో జరుగబోతోంది. గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ తొలి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడం, భారీ రేటింగ్స్ సాధించడంతో రెండో సీజన్‌పై మరింత హైప్ పెరిగింది. హోస్ట్‌గా ఎన్టీఆర్ స్థానంలో ఈ సారి నాని ఉండటం కూడా మరింత ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షోలో పాల్గొనబోయే 16 కంటెస్టెంట్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

సింగర్ గీతా మాధురి

సింగర్ గీతా మాధురి

ప్లేబ్యాక్ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్ట్ గీతా మాధురి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆమెకు సింగర్‌గా మంచి పాపులారిటీ ఉంది.

టీవీ 9 యాంకర్ దీప్తి

టీవీ 9 యాంకర్ దీప్తి

టీవీ 9 యాంకర్ దీప్తి కూడా ఈ రెండో సీజన్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన దీప్తి..... ఆ తర్వాత మీడియా రంగం వైపు వచ్చారు.

 హీరో తనీష్

హీరో తనీష్

బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించిన తనీష్ ప్రస్తుతం సినిమాల పరంగా వెనకబడి పోయాడు. చివరగా ‘నక్షత్రం' మూవీలో నటించిన తనీష్ మళ్లీ బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తేజస్వి మదివాడ

తేజస్వి మదివాడ

తెలుగు నటి తేజస్వి మదివాడ ఈ సారి బిగ్ బాస్ రెండో సీజన్లో తన గ్లామర్ తో ప్రేక్షకులకు కనువిందు చేయబోతోందని తెలుస్తోంది.

దీప్తి సునైనా

దీప్తి సునైనా

కిర్రాక్ పార్టీ చిత్రంలో నటించిన దీప్పి సునైనా కూడా ఈ సారి బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

నటుడు సామ్రాట్

నటుడు సామ్రాట్

తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే సామ్రాట్... కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ సారి ఇతగాడు బిగ్‌బాస్‌ 2లో సందడి చేయబోతున్నాడట.

 బాబు గోగినేని కూడా

బాబు గోగినేని కూడా

మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.... రేషనలిస్ట్ బాబు గోగినేని కూడా ఈ సారి బిగ్ బాస్ సీజన్ 2లో భాగం కాబోతున్నాడట. ఇందులో నిజం ఎంతో ఆదివారం రాత్రి 9 గంటలకు తేలిపోనుంది. హ్యూమనిస్టుగా, రేషనలిస్టుగా, హ్యూమన్ యాక్టివిస్టుగా టీవీ డిబేట్లలో పాల్గొంటూ బాబు గోగినేని పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

కిరీటి దామరాజు

కిరీటి దామరాజు

ఛల్ మోహన్ రంగ సినిమాలో నటించిన కిరీటి దామరాజు కూడా బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్లో పాల్గొన్నబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

యాంకర్ శ్యామల కూడా

యాంకర్ శ్యామల కూడా

ప్రముఖ తెలుగు యాంకర్ శ్యామల కూడా ఈ సారి బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

రోల్ రైడా

రోల్ రైడా

రాహుల్ కుమార్ వేల్పుల అలియాస్ రోల్ రైడా..... ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఈ సారి బిగ్ బాస్ షోలో రోల్ రైడా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సామాన్యులకు చోటు

సామాన్యులకు చోటు

వీరితో పాటు అమిత్ తివారీ, బుల్లితెర నటుడు కౌశల్, భాను.... సామాన్య ప్రజల నుండి గణేష్, సంజన, నూతన్ నాయుడు తదితరులను ఎంపిక చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X