సామ్రాట్‌కు ఊహించని అదృష్టం.. తనీష్ చెత్త కెప్టెన్.. శ్యామల, గీత సేఫ్.. ఆ ముగ్గురికి ముప్పు
బిగ్‌బాస్‌లో 69వ రోజు చాలా ఉత్సాహంగా ముగిసింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాని రాకతో ఇళ్లు సందడిగా మారింది. ఇంటి సభ్యులకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఎలిమినేషన్ ప్రక్రియలో ఇద్దరు సేఫ్ కాగా.. మరో ముగ్గురిపై కత్తి వేలాడుతున్నది. నూతన్ నాయుడు లేకపోవడంపై నాని క్లారిటీ ఇవ్వలేకపోయారు. మాజీ ప్రధాని వాజ్‌పేయికి నానితో సహా ఇంటి సభ్యులు నిమిషం మౌనం వహించారు. ఇంకా ఏం జరిగిందంటే...

నూతన్‌కు రెండు రోజులు రెస్ట్
నూతన్ నాయుడు ఎలా ఉన్నాడని కౌశల్ అడుగగా.. ఆయనకు రెండు రోజులు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. రెండు రోజుల తర్వాత హౌస్‌లోకి వస్తారో లేదో బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొంటారు.

సామ్రాట్‌కు రూ.1 బహుమతి
ఇంట్లో శుక్రవారం మిస్టర్ హ్యాండ్సమ్ పోటీలు జరిగాయి. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారికి రూ.1 లక్ష బహుమతి ప్రకటించారు. ఈ పోటీలో అందరూ మంచి ప్రదర్శన ఇచ్చారు. చివరికి సమ్రాట్ విజేతగా నిలిచి లక్ష రూపాయల చెక్‌ను సొంతం చేసుకొన్నారు. ఈ పోటీలకు దీప్తి, సునైన, గీత, శ్యామల, పూజా జడ్జీలుగా వ్యవహరించారు.

బిగ్‌బాస్ చెత్త కెప్టెన్ తనీష్
కెప్టెన్ బాధ్యతను నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తనీష్‌కు బిగ్‌బాస్ శిక్ష విధించడంపై నాని చర్చించారు. కెప్టెన్‌గా ఉంటూ తప్పు చేయడం బిగ్‌బాస్ షోను అవమానించడమే అని నాని అన్నారు. చెత్త కెప్టెన్ అని అడిగిన ప్రశ్నకు కౌశల్ పేరును ఏకగ్రీవంగా వెల్లడించారు.

సభ్యులతో నాని ర్యాపిడ్ ఫైర్
నాని నిర్వహించిన ర్యాపిడ్ రౌండ్ అన్సర్స్ కార్యక్రమం సందడిగా సాగింది. ప్రతీ ఒక్కరిని కొన్ని ప్రశ్నలు వేసి ఠక్కును సమాధానం రాబట్టడం ఈ ఎపిసోడ్‌కు ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో దీప్తి సునైనా సొమరి, ఎలిమినేట్ చేయడానికి సరైన వ్యక్తి అని అన్నారు.

ఎలిమినేషన్ రౌండ్‌లో
చివర్లో ఎలిమినేషన్ ప్రక్రియ నాని ప్రారంభించారు. ఈ వారం నూతన్ నాయుడు, శ్యామల, గీత, సునైన, రోల్ రైడా, పూజా నామినేట్ అయ్యారు. నూతన్ గాయంతో బయటకు వెళ్లిపోవడంతో మిగితా వారు ఎలిమినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

శ్యామల, గీత మాధురి సేఫ్
ఎలిమినేషన్ ప్రక్రియలో శ్యామల మొదటి అభ్యర్థిగా సేఫ్ అయ్యారు. ఆ తర్వాత రెండో వ్యక్తిగా గీత ఎలిమినేషన్ నుంచి తప్పించుకొన్నారు. రోల్ రైడా, పూజ, సునైన ఎలిమినేషన్ గురించి ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో చర్చిద్దామని నాని కార్యక్రమాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications











