కౌశల్ సంచలన వ్యాఖ్యలు.. బయటకు వచ్చి నీ సంగతి చూస్తా అన్నాడు.. ఫోన్ కూడా చేయలేదు!

Recommended Video

Bigg Boss 2 Winner Kaushal Sensational Comments On Tanish

బిగ్ బాస్2 విజేత కౌశల్ ఎవరూ ఊహించని విధంగా స్టార్ సెలేబ్రిటిగా మారిపోయాడు. కౌశల్ అభిమానులంతా కౌశల్ ఆర్మీగా తయారై అతడికి అనూహ్యమైన మద్దత్తు అందించిన సంగతి తెలిసిందే. దీనితో కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచాడు. బయటకు వచ్చాక కూడా కౌశల్ అభిమానుల నుంచి అదే స్థాయిలో మద్దత్తు లభిస్తోంది. కౌశల్ ఎక్కడ కనిపించినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజగా కౌశల్, నీలిమ దంపతులు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

 కౌశల్ ఆర్మీ గురించి

కౌశల్ ఆర్మీ గురించి

బిగ్ బాస్ హౌస్ లో సభ్యులంతా ఒకవైపు.. నేనొక్కడినే ఒకవైపు ఉండి వన్ మాన్ ఆర్మీలా పోరాటం చేశాను. ఈ వన్ మాన్ ఆర్మీ కోసం తన అభిమానులంతా బయట కౌశల్ ఆర్మీగా తయారయ్యారు అని కౌశల్ తెలిపాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కౌశల్ పలు సందర్భాల్లో తాను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

 అమ్మాయి చేయి పట్టుకుంటేనే

అమ్మాయి చేయి పట్టుకుంటేనే

ఒక అమ్మాయి చేయి పట్టుకుంటేనే హౌస్ లో రాద్ధాంతం చేశారు. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం హగ్గులు, కిస్సులు చేసుకుంటే దానిని ఏమనాలో అంటూ కౌశల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆపిల్ టాస్క్ విషయంలో భానుశ్రీతో జరిగిన గొడవ గురించి కౌశల్ పరోక్షంగా ప్రస్తావించాడు.

లవ్ ఎఫైర్స్

లవ్ ఎఫైర్స్

కౌశల్ సతీమణి నీలిమ మాట్లాడుతూ.. గతంలో తనకున్న లవ్ ఎఫైర్స్, ఇతర విషయాలు అన్ని అయన నాతో చెప్పారు. పెళ్లయ్యాక ఇద్దరం సంతోషంగా ఉన్నాం అని నీలిమ తెలిపింది. ఈ బంగారం గతంలో ఏమో కానీ నాదగ్గరకు వచ్చాక మాత్రం బాగానేవుంది అంటూ తన భర్త గురించి సరదాగా వ్యాఖ్యానించింది.

 ప్రపంచంలో ఎవరికీ రాలేదు

ప్రపంచంలో ఎవరికీ రాలేదు

ఈ ప్రపంచంలో ఏ రియాలిటీ షో చూసుకున్నా 40 కోట్ల ఓట్లు ఎవరికీ రాలేదు, బిగ్ బాస్ లో నాకు వచ్చాయని కౌశల్ తెలిపాడు. కౌశల్ బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు అతడి అభిమానులు భారీ స్థాయిలో ట్రెండ్ నిర్వహించారు. కౌశల్ నామినేషన్ లో ఉన్న ప్రతిసారి కౌశల్ ఆర్మీ మద్దతుతో ఎలిమినేషన్ నుంచి సులువుగా బయట పడ్డాడు.

 నా భార్యపై కూడా దారుణంగా

నా భార్యపై కూడా దారుణంగా

అసభ్యకరమైన ట్రోలింగ్ చేసేవాళ్ళు కౌశల్ ఆర్మీనే కాదని కౌశల్ తెలిపాడు. తన భార్యపై జరిగిన దారుణమైన ట్రోలింగ్ చూస్తే షాక్ అవుతారని కౌశల్ ఇంటర్వ్యూలో తెలిపాడు. కౌశల్ లోపల పోరాడుతుంటే.. తాను బయట ఇబ్బందులు ఎదుర్కొంటూ భాదపడ్డానని నీలిమ తెలిపారు.

 నీ సంగతి చూస్తా అన్నాడు

నీ సంగతి చూస్తా అన్నాడు


తనీష్ గురించి కౌశల్ మాట్లాడుతూ.. బయటకు వచ్చాక నీ సంగతి చూస్తా అని అన్నాడు. కౌశల్ మాత్రమే కాదు.. ఇంత వరకు తనకు ఏ కంటెస్టెంట్ కూడా కనీసం ఫోన్ చేయలేదని కౌశల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో తాను ఎవ్వరిని ఏమీ చేయలేదని.. వారి గోతిలో వాళ్లే పడ్డారు అని ఇంటి సభ్యుల గురించి మాట్లాడాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X