కౌశల్ రియాక్షన్: రామ్ చరణ్ మూవీ ఛాన్స్, మహేష్ బాబు విషెస్, గిన్నిస్ బుక్ రికార్డ్ గురించి...

బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్‌కు రామ్ చరణ్-బోయపాటి సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయనకు వచ్చిన భారీ ఓట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. కౌశల్ విన్ అవ్వడంపై సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం అభినందించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. తాజాగా అభిమానులతో లైవ్ చాట్ చేసిన కౌశల్ పై అంశాలపై స్పందించారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటో అభిమానులకు వివరించారు.

Recommended Video

Kaushal Manda Says 'I'm Waiting For The Opportunity In The Film'
 త్వరలో విజయ యాత్ర

త్వరలో విజయ యాత్ర

త్వరలో జరుగబోయే నా విజయ యాత్రల ద్వారా అభిమానులను కలుస్తాను. క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేస్తాను. అభిమానులు కూడా మీకు తోచిన సహాయం చేయండి. నా తల్లి స్వర్గస్తులైన తర్వాత ఆమె జ్ఞాపకంగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు మీ అందరూ కూడా తోడయితే ఇంకా బావుంటుంది. ఆర్థికంగా లేక క్యాన్సర్‌తో బాధ పడుతున్న ప్రతి ఒక్కరికీ మనం సహాయం చేయాలి. అందుకే నాకొచ్చిన క్యాష్ ఫ్రైజ్ కూడా వారికే ఖర్చు పెట్టబోతున్నాను.... అని కౌశల్ తెలిపారు.

 రాజకీయంగా, సినిమాల్లో... ఎలా వాడినా ఓకే

రాజకీయంగా, సినిమాల్లో... ఎలా వాడినా ఓకే

కౌశల్ ఫ్యూచర్ నడిపించే బాధ్యత కౌశల్ ఆర్మీకే అప్పగించాను. నా సర్వస్వం మీరే. మీరు నన్ను రాజకీయ నాయకుడిగా వాడుకుంటారో? యాక్టర్‌గా వాడుకుంటారో? అంతా మీ చేతిలోనే ఉంది. మీరు ఒక్క మాట చెబితే ఎక్కడికంటే అక్కడికి వస్తాను... అని కౌశల్ తెలిపారు.

రామ్ చరణ్-బోయపాటి మూవీ ఛాన్స్ గురించి

రామ్ చరణ్-బోయపాటి మూవీ ఛాన్స్ గురించి

రామ్ చరణ్ మూవీ కన్‌ఫర్మ్ అయిందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.... ఇప్పుడే కన్ ఫర్మ్ అవుతోంది. ఫైనల్ అయిన తర్వాత చెబుతాను. నా లైఫ్ లో ప్రతి న్యూస్ మీకు అందిస్తూ ఉంటాను. మీరు లేకుంటే ఈ కౌశల్ లేడు. మీ ఆర్మీ లేకుంటే ఈ వన్ మన్ ఆర్మీకి దిక్కే లేదు. కౌశల్ ఆర్మీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను... అన్నారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

కౌశల్ ఆర్మీ వల్ల త్వరలో గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తొందరలో చోటు దక్కబోతోంది. ఒక సింగిల్ కంటెస్టెంటుకు ఇన్ని ఓట్లు రావడం అనేది టీవీ హిస్టరీలోనే లేదంట. నాకు నిన్ననే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి నుంచి కాల్ వచ్చింది. వారు కొంత సమయం అడిగారు. త్వరలోనే అనౌన్స్ చేస్తామన్నారు.. అని తెలిపారు.

వారితో రిలేషన్ పెట్టుకోను

వారితో రిలేషన్ పెట్టుకోను

బిగ్ బాస్ 2 ఇంటి సభ్యులతో అస్సలు రిలేషన్ పెట్టుకోకండి అని ఓ అభిమాని సూచించగా... మనం గేమ్‌లో ఉన్నంత కాలం ఆడాం. ఆట అయిపోయింది. కాబట్టి మన పని మనం చూసుకోవాలి. ఇపుడు నేను చేస్తుంది అదే. మనం గేమ్ ఆడాం, విజయం సాధించాం. బయటకు వచ్చిన తర్వాత ఆ సాధించిన విజయాన్ని లైఫ్ అంతా ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆలోచించాలి అని కౌశల్ అన్నారు.

ఇంటి సభ్యులు ఎవరూ నాకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు

ఇంటి సభ్యులు ఎవరూ నాకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు

ఇంటి సభ్యులందరూ నాకు వంట చేసి పెట్టారు కాబట్టి... వంట చేసి భోజనం పెట్టిన వారు మనకు తల్లితో సమానం. అదే కృతజ్ఞత భావంతో, అదే రెస్పెక్టు రెస్టాఫ్ లైప్ నేను హ్యాపీగా ఉంటాను. బయటకు వచ్చిన తర్వాత ఎవరూ నాకు కంగ్రాట్స్ చెప్పడం, మాట్లాడటం జరుగలేదు. ఎప్పుడైతే వారు నాకు ఫోన్ చేస్తారో, నాకు టైమ్ దొరికినపుడు వారికి ఫోన్ చేసి మాట్లాడతానో వారికి తప్పకుండా థాంక్స్ చెబుతాను... అని కౌశల్ అన్నారు.

మహేష్ బాబు విష్ చేయడంపై

మహేష్ బాబు విష్ చేయడంపై

మహేష్ బాబు నా ఫ్రిన్స్. నా ఫస్ట్ ఫిల్మ్ హీరో. ఆయన నా గురించి ట్వీట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రాజకుమారుడు సినిమా చేసిన సమయంలో ఆయనతో ఎక్కువ సమయం గడిపాను. మహాభలేశ్వరం షూటింగులో ఆయనతో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పుడూ మరిచిపోలేను. ఆయన నన్ను విష్ చేసిన విషయం నా జీవితాంతం గుర్తుంచుకుంటాను... అని కౌశల్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X