ప్రధాన మంత్రి ఆఫీస్ నుంచి షాక్.... బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ చెప్పింది బోగసా?
Recommended Video

'బిగ్ బాస్ 2' విన్నర్ కౌశల్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తెలుగు రాష్ట్రాల్లోని జనాలు ఆశ్చర్య పోతున్నారు. కేవలం ఒక టీవీ రియాల్టీ షోలో పాల్గొన్న వ్యక్తి ఇంత పెద్ద సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకోవడం అనేది అరుదైన పరిణామం అనే చెప్పాలి.
ఇదంతా ఒకే కానీ... బిగ్ బాస్ 2 హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ తనకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఒక ప్రైవేట్ ఛానల్‌లో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని ఒక రియాల్టీ షోలో విజేతగా నిలిచిన వ్యక్తిని ప్రధాన మంత్రి కార్యాలయం అభినందించడం ఏమిటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఆర్టీఏ చట్టం ద్వారా అసలు విషయం
ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఆర్టీఏ(రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్) చట్టం ద్వారా ఈ విషయాన్ని ఆరా తీశారు. దీనికి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి షాకింగ్ సమాధానం వచ్చింది. పీఎం కార్యాలయం నుంచి అధికారికంగా కౌశల్‌ను అభినందిస్తూ ఎలాంటి ఫోన్ చేయలేదని తేలింది.

కౌశల్ చెప్పింది అంతా బోగసా?
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది అని ప్రగల్భాలు పలికిన కౌశల్ చెప్పింది అంతా బోగసా? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ వారు ఈ అంశంపై కౌశల్‌తో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించారు.

కౌశల్ వివరణ
పిఎం ఆఫీసులో పీఆర్ఓగా పని చేసే ప్రదీప్ జోషికి అసిస్టెంటుగా పని చేసే చంద్రమోహన్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పారని, అతడి ఫోన్ నెంబర్ కూడా నా వద్ద ఉంది... అంటూ కౌశల్ వివరణ ఇచ్చారు. దీంతో సదరు టీవీ ఛానల్ రిపోర్ట్ నేరుగా చంద్రమోహన్‌కు కాల్ కనెక్ట్ చేయడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వ్యక్తిగతంగానే ఫోన్ చేశానన్న చంద్రమోహన్
నేను ఇండిపెండెంట్ సెఫాలజిస్టును, నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి కౌశల్‌ను అభినందించాను. బిగ్ బాస్ చూసిన తరవాత కౌశల్ అంటే నాకు అభిమానం ఏర్పడిందని తెలిపారు. నాకు పీఎం ఆఫీసుతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పాను తప్ప...పీఎం కార్యాలయం నుంచి అని చెప్పలేదని. తాను పీఎంఓలో పని చేయడం లేదని, మిస్ కమ్యూనికేషన్ వల్లే కౌశల్, వాళ్ల నాన్న అలా అర్థం చేసుకున్నారని చంద్రమోహన్ తెలిపారు.

కౌశల్‌ను ఎంపీ చేయాలని ప్లాన్?
కౌశల్‌ను ప్రధాన మంత్రి దగ్గరకు తీసుకెళతానని వాళ్ల నాన్నకు ఫోన్ చేసినపుడు చెప్పాను. అతడి వల్ల సమాజానికి ఎక్కువ ఉపయోగం జరుగుతుందని అలా చెప్పాను. బిగ్ బాస్ 4(హిందీ) సీజన్ కంటెస్టెంట్, బీహార్‌కు చెందిన మనోజ్ తివారీ ఇపుడు ఢిల్లీ బీజేపీ చీఫ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎంపిగా కూడా ఉన్నారు అని చంద్రమోహన్ చెప్పారు. దీనికి రిపోర్టర్ స్పందిస్తూ రేపు కౌశల్ ఎంపీ అయితే నేనే ముందుగా హ్యాపీగా ఫీలవుతాను అని వ్యాఖ్యానించారు.

నాకెలా తెలుస్తుంది? అందుకే అలా చెప్పానన్న కౌశల్
నాకు ఫోన్ చేసిన వ్యక్తి పీఎంఓ నుంచి అని చెప్పడంతో .... నేను అలా ప్రకటించుకున్నాను. కానీ ఆయన వ్యక్తిగతంగా చెప్పారా? లేదా అఫీషియల్‌గా చెప్పారా? అనే విషయం నాకెలా తెలుస్తుంది అని ఈ సందర్భంగా కౌశల్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











