twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ ఫైనల్లో నా శిష్యుడు.. నా సపోర్ట్ ఎవరికంటే.. కౌశల్ ఇంట్రెస్టింగ్ వీడియో

    |

    Recommended Video

    బిగ్‌బాస్ ఫైనల్లో నా శిష్యుడు.. నా సపోర్ట్ ఎవరికంటే.. కౌశల్ ఇంట్రెస్టింగ్ వీడియో

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 3 సీజన్‌లోని టాప్ 5 కంటెస్టెంట్లలో ఎవరికి సపోర్ట్ చేస్తున్నావని అడుగుతున్నారు. అయితే ఈ షోలో ఒకరు సపోర్ట్ చేయడం వల్ల గానీ, వారి స్నేహితులు, సన్నిహితులు సపోర్టు చేయడం వల్ల గానీ విజేతలుగా నిలుస్తారనేది అబద్దం. ప్రజలు, ప్రేక్షకుల మనసులు గెలచుకొనే వారు విజేతలుగా నిలుస్తారు. ముందుగా టాప్ 5లో నిలిచిన వారందరికి నా శుభకాంక్షలు. 90 రోజులు పనిచేసిన తర్వాత టాప్ 5లో చోటు దక్కడమే గొప్ప విజయం అని కౌశల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వీడియో రిలీజ్ చేసి.. టాప్ 5 సెలబ్రీలలో తన మద్దతు ఎవరికో తెలిపారు. వివరాల్లోకి వెళితే..

     ఫ్యామిలీకి దూరంగా

    ఫ్యామిలీకి దూరంగా

    ఫ్యామిలీకి దూరంగా ఉంటూ.. చాలీ చాలని ఫుడ్‌తో, ఎన్నో టాస్కులు, రకరకాల మానసిక ఒత్తిడి మధ్య అనేక రోజులు ప్రయాణం చేసి టాప్ 5 జాబితాలో ఉండటం పెద్ద టాస్క్. టాప్ 5లో ఉన్న అలీ రెజా, రాహుల్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి అందరూ నాకు పరిచయమే. వారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని కౌశల్‌ పేర్కొన్నాడు.

     నా శిష్యుడు టాప్ 5లో ఉంటే

    నా శిష్యుడు టాప్ 5లో ఉంటే


    టాప్‌ 5లో ఉన్న అలీ రెజా నాకు శిష్యుడు. 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మోడల్‌గా ట్రైనింగ్ తీసుకొన్నాడు. అప్పుడు మేకోవర్ చేసి ఫస్ట్ ఫోటోషూట్ నేనే చేశాను. ర్యాంప్ మీద వాకింగ్ నేర్పాను. తొలి యాడ్ ఫిలిం కూడా నేనే డైరెక్ట్ చేశాను. తనకు ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా నేనే ఇచ్చాను. అలాంటి అలీ రెజా ఫైనల్‌ ఉండటం నాకు ఆనందంగా ఉంది అని కౌశల్ తెలిపారు.

    బాబా భాస్కర్ గురించి

    బాబా భాస్కర్ గురించి

    ఇక బాబా భాస్కర్ నాకు బాగా తెలుసు. నేను ఘర్షణ అనే షో చేస్తే ఆయన జడ్జీగా ఉన్నాడు. మంచి కొరియోగ్రాఫర్. అప్పటి నుంచి చాలా జోవియల్‌గా ఉన్నారు. బయట ఎలా ఉంటారో.. బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అలానే ఉన్నాడు. బాబాకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవు. అయినా అతడికి ఓట్లు వేసి టాప్ 5 వరకు తీసుకొచ్చిన వారికి నా ధన్యవాదాలు అని కౌశల్ వెల్లడించారు.

    వరుణ్ సందేశ్ నాకు తెలుసు

    వరుణ్ సందేశ్ నాకు తెలుసు

    వరుణ్ సందేశ్ హ్యపీ డేస్ ద్వారా మనకు పరిచయమయ్యారు. ఆయన అనుకొన్నది.. అనుకొన్నట్టు చెబుతారు. స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఆయన టాప్ 5లో రావడం చాలా సంతోషంగా ఉంది. వరుణ్‌ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు థ్యాంక్స్ అని కౌశల్ పేర్కొన్నారు.

    శ్రీముఖితో కలిసి మూడు షోలలో

    శ్రీముఖితో కలిసి మూడు షోలలో

    ఇక శ్రీముఖి మంచి టాలెంటెడ్. ఆమెతో కలిసి రెండు, మూడు షోలలో పనిచేశాను. నాకు మంచి రిలేషన్ ఉంది. మంచి యాంకర్. బయట ఎలా జోవియల్‌గా, లవ్‌గా ఉంటుంది. ఇంట్లో కూడా అలానే బిహేవ్ చేసి చాలా మందిని ఆకట్టుకొన్నది. ఇప్పటి వరకు సపోర్ట్ చేసి టాప్ 5కు తీసుకొచ్చిన అభిమానులకు నా కంగ్రాట్స్ అని కౌశల్ మండా తెలిపారు.

    రాహుల్ సిప్లిగంజ్ గురించి

    ఇక రాహుల్ సిప్లిగంజ్ వెరీ గుడ్ సింగర్. మధ్యలో డల్‌గా కనిపించారు. చివర్లో బాగా పికప్ అయ్యారు. రాహుల్ ఆడిన గేమ్‌కు నచ్చి ఆయనను టాప్ 5లో నిలిపారు. ఫైనల్‌కు తీసుకొచ్చిన అభిమానులకు, ఫ్యాన్స్‌కు నా థ్యాంక్స్. ఈ ఐదుగురు టాప్ కంటెస్టెంట్లు తమ గేమ్ ప్రదర్శించి వాళ్లు రియల్ గేమ్‌తో విజేతగా నిలిచేందుకు ప్రయత్నించాలి అని కౌశల్ పేర్కొన్నారు. బిగ్‌బాస్ విజేతగా నేను మధ్యస్తంగా ఉంటాను. ఎవరు గెలిచినా నాకు సంతోషమే అని కౌశల్ అన్నారు.

    English summary
    Bigg Boss 3 telugu top contest: Bigg Boss 3 season started with Nagarjuna as host. As per Latest news, Siva Jyothy was eliminated from the show. After her elimination, Rahul, Varun, Sreemukhi, Baba Bhaskar, Ali reza are top 5 finalists. Bigg Boss 2 winner Kaushal has made his comments on finalists.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X