ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేట్ వస్తదా?... కౌశల్ ఆర్మీ ప్రతాపం, రంగంలోకి కౌశల్, రోల్ రైడా క్షమాపణ!
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు 2 కంటెస్టెంట్ రోల్ రైడా విడుదల చేసిన 'రాదు రాదు' అనే సాంగ్ వివాదాస్పదం అయింది. ఈ పాటలో 'ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేటు వస్తదా? ' అనే లైన్ ఉండటంతో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మద్దతుదారులైన కౌశల్ ఆర్మీ హర్ట్ అయింది. దీంతో రోల్ రైడా వీడియో ఆల్బం మీద తమ ప్రతాపం చూపించారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ వీడియోను డిస్ లైక్స్ చేస్తూ తమ పవర్ చూపించారు.
బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత కౌశల్ మాట్లాడుతూ.... తనకు హార్వెస్ట్ బైబుల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇవ్వబోతున్నారని చెప్పారు. ఈ విషయమై అప్పట్లో టీవీ ఛానల్స్‌లో చర్చాకార్యక్రమాలు కూడా జరిగాయి. చివరకు ఆ అవార్డు ఇస్తానని చెప్పి కొందరు కౌశల్‌ను మోసం చేసినట్లు తేలిసింది.

‘రాదు రాదు' పాటపై కౌశల్
ఈ పాట వివాదంపై కౌశల్ రియాక్ట్ అయ్యారు. ‘ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేటు వస్తదా?' అని రోల్ రైడా చెప్పిన దానికి, పాడిన దానికి సంబంధం లేదు. తను ఎందుకు అలా పాడాల్సి వచ్చిందో తెలుసుకుంటే బెటర్. తను ఏదో ఉద్దేశ్యంతో పాడి కవర్ చేసుకోవడానికి ఇంకేదో చెబుతున్నాడు. రోల్ రైడా ఎందుకు అలా పాడాడో అతడినే అడిగితే బావుంటుంది' అని కౌశల్ వ్యాఖ్యానించారు.

డిస్ లైక్స్ రావడంపై రోల్ రైడా వివరణ
దీనిపై రోల్ రైడా స్పందిస్తూ... ‘రాదు అనే సాంగ్' విడుదల చేశాను. వ్యూస్‌తో పాటు డిస్ లైక్స్ కూడా వస్తున్నాయి. అయితే ఒక విషయంలో బాధ అనిపిస్తోంది. రాదు అనేది ట్రోల్ సాంగ్. ఏవైతే అంశాలు ట్రోల్ అయ్యాయో ఒక పాటలో చూపించాం. నాది కూడా ‘పరపరపర పప్పర' ట్రోల్ అయింది. ఈ విషయంలో నా మీద నేను కూడా కౌంటర్ వేసుకున్నా. డిస్ లైక్స్ ఎందుకు వస్తున్నాయని చూస్తే.... రోల్ రైడా ఆర్మీ కౌశల్ గురించి, డాక్టరేట్ గురించి అన్నట్లు చెబుతున్నారు. కానీ తన అసలు ఉద్దేశ్యం కౌశల్‌ను ట్రోల్ చేయడం కాదన్నారు.

కౌశల్‌ను ట్రోల్ చేయలేదు, ఆయనతో మంచి రాపో ఉంది
డాక్టరేట్, గిన్నిస్ బుక్ రికార్డ్ విషయంలో కౌశల్‌పై గతంలో ట్రోలింగ్ జరిగింది. ఎవరైతే కౌశల్‌ను అవి ఇస్తానని చెప్పి మోసం చేశారో వారిని ఈ సాంగులో ట్రోల్ చేశాం. కౌశల్ గురించి ట్రోలింగ్ చేయలేదు. ఇటీవల నాకు ‘నట సంగీత సవ్యసాచి' అవార్డ్ వచ్చింది. ఇది కౌశల్ వల్లనే వచ్చింది. కౌశల్ రెఫర్ చేయడం వల్లనే ఈ అవార్డు వచ్చింది. ఈ విషయంపై ఆయనకు కాల్ చేసి థాంక్స్ కూడా చెప్పాను. మా మధ్య అంత మంచి రాపో ఉంది. ఆయన్ను ట్రోల్ చేసి మా మధ్య ఉన్న సంబంధాన్ని ఎందుకు చెడగొట్టుకుంటాను? బిగ్ బాస్ షోలో చాలా టాస్కుల్లో నాకు హెల్ప్ చేశాడని రోల్ రైడా తెలిపారు.

మిస్ ఫైర్ అయింది, సారీ
నేను అనుకుంది ఒకటి, అయింది మరొకటి. మిస్ ఫైర్ అయినందుకు సారీ. నాకు కౌశల్ ఆర్మీ వారు చాలా సపోర్ట్ చేశారు. అలాంటి ఆర్మీకి నెగటివ్ ఇస్తే నాకేం రాదు. ఆ పాయింట్ అందరూ అర్థం చేసుకోవాలి . కౌశల్‌తో కూడా ఈ విషయమై మాట్లాడాను అని రోల్ రైడా తెలిపారు.
రాదు.. రాదు.. రాదు రాదు రాదు రాదు
ఓటే వేయకుంటే మంచి గవర్నమెంట్ వస్తదా?
స్మోకింగ్ చేయకుంటే క్యాన్సరైన వస్తదా?
మందే తాగకుంటే లివర్ చేతికొస్తదా?
ముఖేషు లేకుండా సినిమా అయినా వస్తదా?
రాదు.. రాదు.. రాదు రాదు రాదు రాదు
ట్రోలింగ్ ఆపమంటే బుద్ది మనకు వస్తదా?
పబ్జి ఆడకుంటే చికెన్ డిన్నర్ వస్దదా?
రోడ్డు మీద ఉచ్చపోస్తే సిగ్గు మనకు వస్తదా?
ఆర్మీ పెట్టుకుంటే డాక్టరేటు వస్తదా?
రాదు.. రాదు.. రాదు రాదు రాదు రాదు
తాగి నడుపుతుంటే స్పెలింగే గుర్తుకొస్తదా?
హెల్మెట్ పెట్టుకుంటే పోలీస్ వస్దదా?
కాన్వాసింగ్ జరుగుతుంటే గణేష్ మహరాజ్ వస్తడా?
బికాం చదువుతుంటే ఫిజిక్స్ మనకు వస్తదా?
రాదు.. రాదు.. రాదు రాదు రాదు రాదు


Click it and Unblock the Notifications











