ఎంత బిల్డప్ ఇచ్చినా ఛాన్సులు వచ్చేలా లేవు.. కౌశల్ మండా చివరికి ఇలా..
నిజానికి బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో స్టార్ట్ అవ్వగానే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. ప్రసారమైన మూడు సీజన్లకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. కంటెస్టెంట్స్ ఎవరికి వారు వారి క్రేజ్ ని మరింతగా పెంచుకున్నారు. అయితే ఈ మూడు సీజన్స్ లలో కొంతమందికి భారీగా క్రేజ్ అందింది. ఇండస్ట్రీలో ఎదో ఒక విదంగా బిజీ అయ్యారు. అయితే కౌశల్ మండా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. చివరికి చిన్న తరహా పాత్రలే అందుకుంటున్నాడు.

బిగ్ బాస్ 2 విన్నర్..
నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో అందరికంటే ఎక్కువగా క్రేజ్ అందుకుంది మాత్రం కౌశల్ మండానే. కొన్ని సమయాల్లో అతని వల్ల నానిపై కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కౌశల్ ని టచ్ చేస్తే వారిపై తీవ్ర ప్రభావం పడేది. చివరికి ఒంటరిగానే పోరాడి కౌశల్ బిగ్ బాస్ 2 టైటిల్ అందుకున్నాడు.

కౌశల్ ఆర్మీ హవా..
కౌశల్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్ లో ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి అతని స్థాయి మారిపోయింది. అప్పటివరకు మొహం చూస్తే గాని అతను ఎవరో గుర్తుపట్టలేని వారు కూడా కౌశల్ అన్న అంటూ సందడి చేశారు. స్పెషల్ గా కౌశల్ ఆర్మీ అంటూ గ్రూపులు ఏర్పడ్డాయి. కానీ ఆ ఆర్మీ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా కౌశల్ పై తీవ్ర ప్రభావం చూపాయి.

అవకాశాలు వస్తాయని అనుకుంటే..
సాధారణంగా బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ అందుకుంటే తప్పకుండా సినిమాల్లో ఎదో ఒక విధంగా ఛాన్స్ లు కొట్టేయవచ్చని అనుకుంటారు. కానీ కొందరికి ఆ అదృష్టం కలిసి రాదు. కౌశల్ లాంటి ట్రెండ్ సెట్టర్ కి కూడా పెద్దగా ఛాన్సులు వచ్చింది లేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ నిజ జీవిత పాత్రను హైలెట్ చేస్తూ ఒక సినిమా చేస్తున్నట్లు హడావుడి చేసినప్పటికీ ఆ సినిమా ఎందుకో రిలీజ్ కాలేదు.
Recommended Video

మొత్తానికి ఒక సినిమాలో..
కౌశల్ మండా ఇన్నాళ్లకు ఒక మాంచి క్యారెక్టర్ అందుకున్నట్లు టాక్ వస్తోంది. సాయి కుమార్ తనయుడు ఆది నెక్స్ట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడట. మొత్తానికి ఒక సినిమాలో అయితే ముఖ్యమైన పాత్రను అందుకున్నాడు గాని.. ఇంతకంటే హై రేంజ్ లో స్టార్ హీరోలతో నటిస్తాడు అనుకున్న కౌశల్ ఆడియెన్స్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు.


Click it and Unblock the Notifications











