సిగ్గులేదురా.. నేను నా మొగుడికే.. అంటూ పునర్నవి ముందే రాహుల్‌పై వితిక ఫైర్
బిగ్‌బాస్ రియాలిటీ షోలో 26వ రోజు భావోద్వేగాలకు, ఆనందానికి వేదికగా మారింది. ఇంటి సభ్యులు ఆనందంగా రాఖీ పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. అలాగే క్విజ్ పోటీలో పాల్గొని తమ నాలెడ్జిని ప్రేక్షకులతొ షేర్ చేసుకొన్నారు. 26 రోజు జరిగిన విషయాలు మరింత వివరంగా..

రాహుల్‌కు వితిక ఫైర్
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో వితిక, పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. డైనింగ్ టేబుల్‌పై కూర్చొని మాట్లాడుకుంటుండగా.. వితిక, పునర్నవి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. ఇంతలో రాహుల్‌కు పునర్నవి తినిపిస్తుండగా వితిక షాకింగ్‌గా ఓ కామెంట్ చేసింది. సిగ్గులేదా.. అలా తినడం.. నేను నా మొగుడికే తినిపించడం లేదు అంటూ వితిక అనగానే రాహుల్ నవ్వుతూ పునర్నవి వంక చూశాడు.

ఇంటిలో క్విజ్ పోటి
ఇక బిగ్‌బాస్ ఇంటిలో క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ క్విజ్ పోటికి శివజ్యోతి మాస్టర్‌గా వ్యవహరించగా.. ఆడవాళ్లు ఓ జట్టుగా, మగవాళ్లు మరో జట్టుగా ఆడారు. మూడు రౌండ్లు సాగిన ఈ పోటిలో పురుషులు జట్టు విజయం సాధించింది. ముందుగా చెప్పిన విధంగా గెలిచిన జట్టుకు హ్యాపీ ఫిజ్‌ను బహుమతిగా అందించారు. అలాగే క్విజ్ మాస్టర్‌కు ఓ హ్యాప్పీ ఫిజ్ లభించింది.

బిగ్‌బాస్‌కు రాఖీ కళ
బిగ్‌బాస్ ఇళ్లు రాఖీ పండుగతో కళకళలాడింది. ఇంటి సభ్యులకు తమ ఫ్యామిలీ పంపించిన రాఖీలను తమకు ఇష్టమైన వారితో కట్టించుకొన్నారు. అలి రాజా తన రాఖీలను శివజ్యోతితో, వరుణ్‌కు పునర్నవి, బాబా భాస్కర్‌కు శ్రీముఖి రాఖీలు కట్టి తమ సోదరభావాన్ని చాటుకొన్నారు. అలీరెజాకు మూడు రాఖీలు రాగా వాటిని శివజ్యోతి కట్టించుకొని కమ్మలు ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అలీ రెజా సిస్టర్స్ తనకు బహుమతి పంపించడంపై శివజ్యోతి ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకొన్నారు.

పునర్నవి రాఖీ కట్టేముందు
పునర్నవి తన ఇంటి నుంచి వచ్చిన రాఖీని కట్టేముందు కొంత డ్రామా నెలకొన్నది. ఇంటి సభ్యులందరూ నాకు సోదరులేనని చెప్పింది. ఒక్క రాహుల్‌ను నేను సోదరుడిగా భావించడం లేదు అనగానే అందరూ నవ్వుకొన్నారు. రాహుల్ కూడా ఆ మాటతో ఊపిరి పిల్చుకొన్నాడు. ఇంటిలోకి వచ్చిన తర్వాత వరుణ్‌లో నా తమ్ముడిని చూసుకొంటున్నాను అని పునర్నవి చెప్పింది. ఈ విషయం గురించి వితికతో ముందుగా చెప్పానని పేర్కొన్నది.

బాబా భాస్కర్‌కు భార్య వీడియో
చివర్లో బాబా భాస్కర్ కోసం ఆయన భార్య పంపిన వీడియోను ఇంటి సభ్యుల ముందు ప్రదర్శించారు. బాబా భాస్కర్ గురించి భార్య మాట్లాడారు. తమ గురించి బెంగ పెట్టుకోవద్దు.. మిమ్మల్ని మేము రోజు చూస్తున్నాం. మీరే మమల్ని చూడటం లేదు. మేము బాగానే ఉన్నాం. మీరు బాగానే ఉన్నారు. నేను మీ డ్యాన్స్ చూసి ప్రేమించి పెళ్లి చేసుకొన్నాను. మన కూతురు వయసు 8 లేదా 9 కాదు.. 10 సంవత్సరాలు అని బాబా భాస్కర్ భార్య చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











