బిగ్ బాస్ 3: అషు రెడ్డిపై దారుణమైన ట్రోలింగ్.. ఇంతకాలం అది ఫేకా?
నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ 3వ సీజన్ రియాల్టీషోలోకి సోషల్ మీడియా సెలబ్రిటీ, నటి అషు రెడ్డి ఎంటరైన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో ఆమె ఎంట్రీ చూసిన చాలా మంది ఫ్యాన్స్ షాకయ్యారు. అందుకు కారణం ఆమె కాస్త బొద్దుగా కనిపించడమే. ఇంతకాలం సోషల్ మీడియా పేజీల్లో ఆమె పోస్టులు చూసిన వారంతా ఆమె నిజమైన పర్సనాలిటీ చూసి అవాక్కవుతున్నారు.
దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ... 'ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఇన్ని రోజులు స్లిమ్ ఫిల్టర్లు యూజ్ చేసేదేమో.. కానీ స్టార్ మా కెమెరాల్లో ఆ ఫిల్టర్ లేదు. అందుకే ఆమె నిజమైన రూపం అందరికీ తెలిసిపోయింది. ఇంతకాలం తన ఫేక్ లుక్ చూపించి ఇంటర్నెట్లో అందరినీ బురిడీ కొట్టించింది'.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అషు రెడ్డికి మద్దతుగా అభిమానులు
అయితే కొందరు అషు రెడ్డి అభిమానులు... ఆమెపై వస్తున్న ట్రోల్స్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘చాలా మంది అషు రెడ్డి బరువు గురించి మాట్లాడుతున్నారు. కొందరు మహిళలు కూడా ఈ విషయాలను చర్చిస్తున్నారు. ఇంతకంటే దిగజారుడు తనం ఏమీ ఉండదు. బిగ్ బాస్ లాంటి చెత్త షోలను చూడటానికి చాలా మందికి సమయం ఉండటమే కాదు, వాటిపై విశ్లేషణలు కూడా చేస్తున్నారు. నిజంగా మీరు చాలా లక్కీ'' అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.

ఇలా చేయడం చాలా బాధాకరం
‘అషు రెడ్డిపై జరుగుతున్న ట్రోల్స్ చూస్తుంటే బాధేస్తుంది. ఒక మహిళ బరువు పెరిగినంత మాత్రాన డిగ్రేట్ చేసి మాట్లాడటం సరైంది కాదు. జనాలు రకరకాల విషయాలపై రకరకాలుగా స్పందిస్తారని ఇప్పుడే అర్థమైంది' అంటూ మరొక యూజర్ వ్యాఖ్యానించారు.

ఎవరీ అషు రెడ్డి?
తన గురించి అషు రెడ్డి బిగ్ బాస్ షోలో పరిచయం చేసుకుంటూ... ‘పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్‌లోనే.. మా ఫ్యామిలీలో అమ్మా, నాన్న, ఒక అక్క, ఒక రాజు... రాజు అంటే బాయ్ ఫ్రెండ్ కాదు మా కుక్క. మాస్టర్స్ కోసం యూఎస్ఏ వెళ్లాను, జాబ్ రావడంతో అక్కడే సెటిలైపోయాను.' అని తెలిపారు.

ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది
గ్రాజ్యువేషన్ అయ్యాక ఫ్రీ టైంలో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసేదాన్ని, అవి అనుకోకుండా చాలా వైరల్ అయ్యేవి. అలా అనుకోకుండా ఓవర్ నైట్లో పెద్ద స్టార్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే పాజిటివిటీ పెరిగిందో... అదే స్థాయిలో నెగిటివిటీ కూడా నేను ఫేస్ చేశాను. ఇదంతా అలవాటైపోయాక ఒక రోజు వీటిని లైట్ తీసుకున్నాను. నేను హ్యాండిల్ చేయగలను అనే నమ్మకం వచ్చింది. ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉందని తెలిపారు.

బ్రేపకప్ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయాను
నా తొలి చిత్రం చల్ మోహన రంగ, ఆ మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాను. సాడెస్ట్ మూమెంట్ నా జీవితంలో బ్రేకప్. దాదాపు 6 నెలలు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నాకు నేనుగా రికవరీ అయ్యాను. నేను ఏమిటి? కొత్త నేను ఎలా ఉంటాను అని చూసుకున్నాను. ఇప్పటి వరకు సోషల్ మీడియా నా యాక్షన్ ఒక్కటే చూశారు. బిగ్ బాస్ హౌస్ లో నా రియాలిటీ ఏమిటో చూపిస్తాను... అని అషు రెడ్డి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











