దారుణంగా బిగ్ బాస్ బ్యూటీ ట్రోలింగ్.. నటి దిమ్మతిరిగే జవాబు
సోషల్ మీడియా వచ్చిన తరువాత విమర్శల హద్దులకు అంతు లేకుండా పోయింది. స్టార్స్ పై ఇష్టం వచ్చినట్లుగా నెగిటివ్ ప్రచారాలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరికొందరు స్టార్స్ కూడా అప్పుడప్పుడు వారికి నచ్చిన స్టైల్ లో కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు. ఇక ఇటీవల బిగ్ బాస్ ఫెమ్ 'షెరీన్'కి కూడా అదే తరహాలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఎదురయ్యాయి.

నెగెటివ్ కామెంట్స్ కొత్తేమి కాదు
సినిమాలకు సంబంధించిన వార్తల కంటే ఎక్కువగా కాంట్రవర్సీ కథనాల వైపే పలు మిడియాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. నటి షెరీన్ పై కూడా ఈ మధ్య కాలంలో కోలీవుడ్ లో ఎక్కువగా నెగిటివ్ వార్తలే వస్తున్నాయి. ఈ విషయంపై ఆమె కొన్ని మీడియా సంస్థలపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్ కూడా వేసింది. మంచి కంటే చెడు విషయాలే ఈ కాలంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని చెప్పింది.

బిగ్ బాస్ తో క్రేజ్..
నటి షెరీన్ కెరీర్ ని చక్కబెట్టుకోవాలనే తపనతో వచ్చిన చిన్న చిన్న ఆఫర్స్ ని ఎంతో జాగ్రత్తగా సద్వినియోగం చెసుకుంటోంది. డేంజర్, జూనియర్స్ అంటూ అప్పట్లో కొన్ని సినిమాలతో తెలుగులో కూడా మెరిసింది. ఇక మంచి క్రేజ్ అందుకోవాలని తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా చేరింది. ఈ రియాలిటీ షోతో అమ్మడి క్రేజ్ కొంతవరకు బాగానే పెరిగింది. కాంట్రవర్సీ లతో తమిళ్ మీడియాకు మంచి స్టఫ్ ఇచ్చింది.

స్వీట్ కామెంట్స్...
బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగుపెట్టినప్పటి నుంచి షెరీన్ కి ఓ వర్గం నెటీజన్స్ నుంచి భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సీజన్ ఎండ్ అయినా అదే తరహాలో ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటోపై ఒక నెటీజన్ కొంత పాజిటివ్ గానే కామెంట్ చేశాడు. ఆంటీలా ఉన్నావ్ అంటూనే ఒక పాజిటివ్ కామెంట్ చేశాడు. బిగ్ బాస్ లో ఆంటీలా ఉన్నావ్ .. ఇప్పుడు యంగ్ హీరోయిన్ మాదిరిగా అవుతున్నవాని చెప్పడంతో ఆ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
Recommended Video

ఆంటీ కామెంట్ కి షెరీన్ ఆన్సర్..
ఇక అతను చేసిన కామెంట్స్ కి షెరీన్ స్వీట్ గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కొంతమంది మన రూపాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని మనసుకు బాధ కలిగించేలా నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే.. ఆత్మాభిమానంతో జీవించే మనుషులం కాబట్టి మనకు మనం మంచి దృష్టితో అభిమానిచేలా మనసును అలవాటు చేసుకోవాలని షెరీన్ ఆన్సర్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











