బిగ్‌బాస్ నుంచి శిల్పా చక్రవర్తి.. వైల్డ్‌కార్డు ఎంట్రీతో వెనుతిరగడంపై అనుమానాలు

Recommended Video

Bigg Boss Telugu 3: బాబా శాపంతో శిల్ప అవుట్!! | Episode 57 Highlights | Filmibeat Telugu

ఏదైనా ఓ ప్రోగ్రాంకు వైల్డ్‌ కార్డ్‌ఎంట్రీ అన్నది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఓ ఫ్లోలో వెళ్తున్న కార్యక్రమాన్ని అమాంతం మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు వైల్డ్‌ కార్డ్‌ను ప్రవేశపెడతారు. అందులోనూ బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోలో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇక షోను వీక్షించే ప్రేక్షకులకైతే.. వైల్డ్‌కార్డ్‌పై ఎన్నో ఊహాగానాలుంటాయి.

అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన తమన్నా..

అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన తమన్నా..

అదే విధంగా బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కు సంబంధించి ప్రవేశపెడుతున్న వైల్డ్‌కార్డ్‌లు బెడిసికొడుతున్నాయి. యాభై రోజుల్లో రెండు వైల్డ్‌ కార్డ్‌ఎంట్రీలిచ్చిన ఈ షోలో ఆమేరకు ఎలాంటి హైప్‌ క్రియేట్‌కాలేదు. వారు వచ్చాక కూడా షో ఏమంత రక్తికట్టించలేకపోయింది. అయితే మొదటగా వచ్చిన తమన్నా సింహాద్రి.. షోలో కీలకంగా మారుతుందని అంతా ఊహించారు. కానీ చివరకు తన చేతులారా చేసుకున్న కర్మలకు ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. హౌస్‌మేట్స్‌ అందరితో గొడవలు పెట్టుకోవడం.. అదే పనిగా రవిని టార్గెట్‌ చేసి హింసించడం.. వేధించడంతో విసుగు చెందిన ప్రేక్షకులు తమన్నాను బయటకు పంపించేశారు.

నిరాశపరిచిన రెండో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ

నిరాశపరిచిన రెండో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ

రెండోవైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీపై ప్రేక్షకుల్లో ఎన్నో ఊహాగానాలు రేకేత్తాయి. ఈషా రెబ్బా, హెబ్బా పటేల్‌, శ్రద్దాదాస్‌ లాంటి హీరోయిన్లు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు హల్‌చల్‌ చేశాయి. తీరా చూస్తే.. ఒకప్పటి యాంకర్‌ శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది. దీంతో మొదట్లోనే శిల్పాపై ప్రేక్షకులకు నిరాశ కలిగింది. వచ్చాక కూడా ఏదైనా మ్యాజిక్‌ చేస్తుందా అని చూసిన ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చింది. ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వకుండా.. హౌస్‌మేట్స్‌తో కూడా సరిగా కలవలేకపోయింది. దొంగలు దోచిన నగరం టాస్క్‌లో దొంగల రాణిగా బాగానే ఆకట్టుకున్నా.. అంతగా మెప్పించలేకపోయింది.

ఈ వారం నామినేషన్‌లో శిల్పా

ఈ వారం నామినేషన్‌లో శిల్పా

వీకెండ్‌లో నాగార్జున ముందు చేసిన అతి.. ప్రేక్షకులకు విసుగుతెప్పించింది. హౌస్‌మేట్స్‌ మినిమమ్‌రెస్పక్ట్‌ ఇవ్వడం లేదని నాగ్‌కు ఫిర్యాదు చేస్తూ కంటతడిపెట్టింది. ఇదే తన కొంప ముంచింది. నామినేషన్‌ విషయంలో ఇదే కారణాన్ని చూపుతూ నామినేట్‌ చేశారు. ప్రేక్షకులు కూడా శిల్పాను పంపించేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ వారం నామినేషన్‌లో ఉన్న మహేష్‌, పునర్నవి, శ్రీముఖి, హిమజలకు గట్టి ఫ్యాన్‌ బేస్‌ ఉండటంతో.. శిల్పా నిష్క్రమణం ఖాయమని అప్పుడే తేలిపోయింది.

 ఎలిమినేట్‌ అయిందంటూ వార్తలు

ఎలిమినేట్‌ అయిందంటూ వార్తలు

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్‌ విషయం.. ముందే లీకవడం పరిపాటిగా వస్తోంది. మొదటునుంచీ ఈ లీకులపర్వం కొనసాగుతూ వస్తూనే ఉంది. తాజాగా ఎనిమిదో వారం నుంచి ఎలిమినేట్‌ కానున్నది ఎవరో అన్న విషయం బయటకు వచ్చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌అవుతూ వస్తోంది. శిల్పా చక్రవర్తి ఎలిమినేట్‌ అయిన విషయాన్ని నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయం అధికారంగా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X