బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : రాహుల్ నెంబర్ 1.. అలీరెజా కామెంట్
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

నెంబర్ వన్ రాహుల్..
టాప్5లో ఉన్న అలీ రెజాకు అతి తక్కువ ఓట్లు రావడంతో అందరి కంటే ముందుగా ఎలిమినేట్ అయ్యాడు. ఈ విషయాన్ని ప్రకటించేందుకు ప్రతిరోజూ పండుగ చిత్రబృందంలోంచి దర్శకుడు మారుతి, హీరోయిన్ రాశీ ఖన్నా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలీ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించి.. స్టేజ్ మీదకు పట్టుకొచ్చారు. అనంతరం రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఇంత మంచి వాడిని మాతో ఎందుకు ఎలిమినేట్ చేయించారని అనగా.. అలా ఏం లేదులే.. ఓ దేవత వచ్చి నన్ను తీసుకెళ్లినట్లు అనిపించిందని అలీ సరదాగా కామెంట్ చేశాడు. అలీకి ఓ టాస్క్ ఇచ్చిన నాగ్.. అందులో రాహుల్ గెలుస్తాడని నెంబర్ 1 పొజిషిన్‌ను ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











