బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : అతి తక్కువ ఓట్లతో అలీ రెజా ఎలిమినేట్.. రాశీ ఖన్నా, మారుతిలతో ప్రకటన
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

అతి తక్కువ ఓట్లతో అలీ రెజా ఎలిమినేట్
ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడించడం, పాటలు పాడించడం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా కొంత ఎంటర్టైన్ చేసిన తరువాత ఎలిమినేషన్ విషయాన్ని గుర్తు చేశాడు నాగ్. టాప్5లోంచి ఒకరు ఎలిమినేట్ అయ్యే సమయం వచ్చేసిందని తెలిపాడు. ఐదో స్థానంలో నిలిచిన కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయబోతోన్నట్లు ప్రకటించాడు. దీనికోసం ప్రత్యేకంగా మారుతి, రాశీ ఖన్నాను ఆహ్వానించాడు.
తెలుసా తెలుసా అంటూ పాట పాడి రాశీ ఖన్నా అందరినీ ఆకట్టుకుంది. శ్రీముఖి నోరేసుకుని పడిపోతుందని మారుతి ఫన్నీగా కామెంట్ చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇద్దరితో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. అతి తక్కువ ఓట్లతో అలీ రెజా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











