Don't Miss!
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : రూ.25 లక్షల ఆఫర్ తిరస్కరించేశారు.. బాబా అవుట్
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..
రాశీ ఖన్నా, మారుతి ఎంట్రీ ఇచ్చి అలీ రెజాను ఎలిమినేట్ చేయగా.. క్యాథరిన్, శ్రీకాంత్ వచ్చి వరుణ్ సందేశ్‌ను ఎలిమినేట్ చేసేశారు. ప్రత్యేక అతిథుల మీదుగా ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించిన నాగ్.. ఎలిమినేషన్ ప్రక్రియకు కాసేపు విరామం ఇచ్చాడు. అనంతరం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ యాక్టర్స్ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఆకట్టుకుంది. వితికా- అగ్ని సాక్షి ఫేమ్ అర్జున్, పునర్నవి- సిరిసిరి మువ్వలు ఫేమ్ అశ్విన్.. రవికృష్ణ-నవ్య స్వామి..శిల్పా చక్రవర్తి-కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ డ్యాన్సులు అదిరిపోయాయి. మూడో ఎలిమినేషన్ కోసం అంజలి గెస్ట్‌గా వచ్చేసింది. పది లక్షలు, ఇరవై లక్షలు, ఇరవైదు లక్షలను హౌస్మేట్స్ అందరూ కాదనుకున్నారు. మూడో ఎలిమినేషన్లో భాగంగా బాబా భాస్కర్ ఎలిమినేట్ అయినట్లు అంజలి ప్రకటించేసింది.