twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : రూ.25 లక్షల ఆఫర్ తిరస్కరించేశారు.. బాబా అవుట్

    |

    జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.

    ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

    Bigg Boss 3 Finale Episode Anjali Announced That Baba Bhaskar Eliminated

    రాశీ ఖన్నా, మారుతి ఎంట్రీ ఇచ్చి అలీ రెజాను ఎలిమినేట్ చేయగా.. క్యాథరిన్, శ్రీకాంత్ వచ్చి వరుణ్ సందేశ్‌ను ఎలిమినేట్ చేసేశారు. ప్రత్యేక అతిథుల మీదుగా ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించిన నాగ్.. ఎలిమినేషన్ ప్రక్రియకు కాసేపు విరామం ఇచ్చాడు. అనంతరం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ యాక్టర్స్‌ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఆకట్టుకుంది. వితికా- అగ్ని సాక్షి ఫేమ్ అర్జున్, పునర్నవి- సిరిసిరి మువ్వలు ఫేమ్ అశ్విన్.. రవికృష్ణ-నవ్య స్వామి..శిల్పా చక్రవర్తి-కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ డ్యాన్సులు అదిరిపోయాయి. మూడో ఎలిమినేషన్ కోసం అంజలి గెస్ట్‌గా వచ్చేసింది. పది లక్షలు, ఇరవై లక్షలు, ఇరవైదు లక్షలను హౌస్‌మేట్స్ అందరూ కాదనుకున్నారు. మూడో ఎలిమినేషన్‌లో భాగంగా బాబా భాస్కర్ ఎలిమినేట్ అయినట్లు అంజలి ప్రకటించేసింది.

    English summary
    Bigg Boss 3 Telugu Finale Episode Highlates. Anjali, Nidhi Aggarwal, Raashi Khanna, Maruthi, Srikanth Are Attending This Grand event.It Is Going To Most Prestigious Event. Lets see Who Is Going To Won Bigg Boss 3 Telugu Title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X