బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : ఐటెం సాంగ్‌లతో అదరగొట్టిన అంజలి
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

ఐటెం సాంగ్‌లతో అదరగొట్టిన అంజలి
కంటెస్టెంట్ల ఆటపాటలు, క్యాథరిన్ స్టెప్పులు, హీరోయిన్ రాశీ ఖన్నా ఎంట్రీ ఇలా కాసేపు ఎంటర్టైన్ చేసిన నాగ్.. ఎలిమినేషన్ ప్రక్రియకు తెరలేపాడు. టాప్5లో తక్కువ ఓట్లతో ఐదో స్థానంలో అలీ రెజా ఎలిమినేట్ అయినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతిరోజు పండగే టీమ్‌ను దింపేసింది బిగ్‌బాస్ బృందం. అనంతరం అనురాగ్ కులకర్ణితో పాటలు పాడించారు. అతను పాడిన ఫేమస్ సాంగ్‌లను స్టేజ్‌పై పాడి అందర్నీ ఆకట్టుకున్నాడు. లేటెస్ట్ సెన్సేషన్ రాములో రాముల సాంగ్‌తో ఒక్కసారిగా వేరే లెవెల్‌కు తీసుకెళ్లాడు. అనంతరం సరైనోడు బ్లాక్ బస్టర్ సాంగ్‌కు, ఖైదీ నెంబర్ 150 ఐటెమ్ సాంగ్‌కు, జైలవకుశ సినిమాలోంచి స్వింగ్ జరా పాటకు స్టెప్పులేసి అంజలి అదరగొట్టేసింది.


Click it and Unblock the Notifications











