బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : ఆకట్టుకున్న వంద రోజుల జర్నీ.. టాప్ లేపిన క్యాథరిన్
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

ఆకట్టుకున్న వంద రోజుల జర్నీ..
తన అమ్మ కోర్ట్ యార్డ్ నుంచి ఎంట్రీ ఇవ్వడంతో తనకు ఇష్టమైన స్థలం అదేనని, ఏ ఫీలింగ్ వచ్చినా ఇక్కడికే వస్తానని శ్రీముఖి తెలిపింది. బాబాకు వంటగది, అలీకి జిమి ఏరియా.. వరుణ్‌కు గార్డెన్ ఏరియాలో ఉన్న సోఫాలు, రాహుల్‌కు బాత్రూమ్ ఏరియా అంటే ఇష్టమని తెలిపారు. అటుపై కంటెస్టెంట్లందరికీ వంద రోజుల జర్నీని ప్లే చేసి చూపించాడు. అన్ని రకాల ఎమోషన్స్‌తోనిండిన ఈ వీడియోను చూసి అందరూ కంటతడి పెట్టారు.
నవ్వులు, ఏడ్పులు, గొడవలు, ప్రేమలు, ఇలా అన్నింటినీ కలిసి అద్భుతంగా చూపించాడు. వాటిని ఎడిట్ చేసిన విధానం కూడా అందర్నీ ఆకట్టుకుంది. జయ జానకీ నాయక పాటకు అదరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చింది క్యాథరిన్. గ్రూప్ డ్యాన్స్‌తో చేసిన ఈ పర్ఫామెన్స్‌లో మిక్స్డ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంది. రేసుగుర్రంలోంచి గల్లపట్టి గుంజుతాంది దీని సూపు.. ఇద్దరమ్మాయిలతో చిత్రంలోని టాపు లేసిపోద్ది అనే పాటకు డ్యాన్సులు వేసి నిజంగానే టాపు లేపేసింది.


Click it and Unblock the Notifications











