Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : రాహుల్ విన్నర్.. వరుణ్ సందేశ్ కామెంట్
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..
కంటెస్టెంట్ల ఆటపాటలు, క్యాథరిన్ స్టెప్పులు, హీరోయిన్ రాశీ ఖన్నా ఎంట్రీ ఇలా కాసేపు ఎంటర్టైన్ చేసిన నాగ్.. ఎలిమినేషన్ ప్రక్రియకు తెరలేపాడు. టాప్5లో తక్కువ ఓట్లతో ఐదో స్థానంలో అలీ రెజా ఎలిమినేట్ అయినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతిరోజు పండగే టీమ్‌ను దింపేసింది బిగ్‌బాస్ బృందం. అనంతరం అనురాగ్ కులకర్ణితో పాటలు పాడించారు. ఐటెం సాంగ్‌లతో అంజలి అదరగొట్టింది. తరువాతి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు శ్రీకాంత్‌ను దింపారు. ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ అంటూ శ్రీకాంత్‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాడు.
రాహుల్
విన్నర్..
పది
లక్షలున్నాయని
ఎవరైనా
తీసుకుని
వెళ్లిపోవచ్చు
అని
ఆఫర్
ఇచ్చాడు.
కానీ
ఆ
ఆఫర్‌ను
అందరూ
తిరస్కరించారు.
20లక్షల
ఆఫర్‌కు
కూడా
ఎవ్వరూ
ముందుకు
రాలేదు.
దీంతో
ప్లాన్
సీ
ని
అమలు
చేసేందుకు
నాగ్
సిద్దమయ్యాడు.
ఈ
మేరకు
టాప్4లో
నిలిచిన
కంటెస్టెంట్‌ను
ఎలిమినేట్
చేసేందుకు
క్యాథరిన్
ఎంట్రీ
ఇచ్చింది.
దీంతో
వరుణ్
సందేశ్
ఎలిమినేట్
అయినట్లు
వారిద్దరు
కలిసి
ప్రకటించారు.
నాల్గో
పొజిషన్లో
ఉండి
ఎలిమినేట్
అయి
బయటకు
వచ్చిన
వరుణ్
సందేశ్..
రాహుల్
గెలిచే
అవకాశాలు
ఎక్కువ
ఉన్నాయని
తెలిపాడు.
మేము
నలుగురం
చాలా
మంచి
స్నేహితులమయ్యామని
తెలిపాడు.
శ్రీ
ముఖి
చాలా
మంచి
ఫైటర్..
ఆమె
గెలిస్తే..
ఫస్ట్
మహిళ
అవుతుందని
తెలిపాడు.