బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : వరుణ్ సందేశ్ ఎలిమినేట్.. ప్రకటించిన శ్రీకాంత్, క్యాథరిన్

జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.

ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Bigg Boss 3 Finale Episode Varun Sandesh Is Eliminated He Is At 4th Position

నాలుగో స్థానంలో వరుణ్..
క్యాథరిన్ స్టెప్పులు, అలీ రెజా ఎలిమినేషన్, అనురాగ్ కులకర్ణి పాటలు, అంజలి ఐటెమ్ సాంగ్ స్టెప్పుల అనంతరం తరువాతి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు శ్రీకాంత్‌ను దింపారు. ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ అంటూ శ్రీకాంత్‌ను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాడు. పది లక్షలున్నాయని ఎవరైనా తీసుకుని వెళ్లిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఆ ఆఫర్‌ను అందరూ తిరస్కరించారు. 20లక్షల ఆఫర్‌కు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ప్లాన్ సీ ని అమలు చేసేందుకు నాగ్ సిద్దమయ్యాడు. ఈ మేరకు టాప్4లో నిలిచిన కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసేందుకు క్యాథరిన్ ఎంట్రీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X