Don't Miss!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్‌ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆరోజే వాడి కాలర్ పట్టుకునే దాన్ని... పిచ్చి వేషాలుంటే నాగార్జున ఒప్పుకుంటారా?
Recommended Video
నాగార్జున హోస్ట్‌గా త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షో వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, రియాలిటీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.
మరో వైపు ఓయూ విద్యార్థి సంఘాలు కూడా ఈ షోకు వ్యతిరేకంగా రంగంలోకి దిగాయి. యువతను చెడుదారి పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ షో హోస్ట్ నాగార్జున ఇంటితో పాటు బిగ్ బాస్ నిర్వాహకుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు నాగార్జున ఇంటి వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా ఈ వివాదంపై నటి హేమ స్పందించారు.
బిగ్ బాస్ షోకు వెళ్లాలని ఉంది
బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో పాల్గొనాలని నాకు ఆశగా ఉంది. నా గురించి నేను తెలుసుకోవాలని ఉంది. రాజకీయాల్లోకి వస్తున్న నన్ను ప్రజలు ఎంత కోరుకుంటున్నారనే విషయం తెలుసుకోవాలని ఉంది. ఒక వేళ అకాశం వస్తే తప్పకుండా వెళతాను అని... హేమ తెలిపారు.
ఈ కేసుల వల్ల షో ఆగదు
బిగ్ బాస్ షో గురించి జరుగుతున్న గొడవ గురించి నాకు అవగాహన లేదు. బిగ్ బాస్ షోలో ఏదైనా జరుగవచ్చు అనేది వారి క్యాప్షన్. వారు కేసులు పెట్టిన బిగ్ బాస్ వారు కోర్టులో గెలవ వచ్చు. వారికి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే వెళతారు. ఇలాంటి కేసుల వల్ల ఈ షో ఆగదని అనుకుంటున్నాను. దీని గురించి నాకు అవగాహన లేదు కాబట్టి నేను స్పందించాలనుకోవడం లేదని హేమ తెలిపారు.
ఆ రోజే కాలర్ పట్టుకుంటా
కొందరు చేస్తున్న ఆరోపణలు రైట్ అని నేను అనలేను. ఏం జరిగినా నెల రోజుల ముందు జరిగినపుడు అప్పుడే చెప్పాలి. ఎవడైనా నన్ను ఏదైనా అంటే ఆరోజే స్పందిస్తాను. ఆ రోజే మీడియాకు ఎక్కుతా.. లేదంటే ఆరోజు వాడి కాలర్ పట్టుకుంటాను. నన్ను సెలక్ట్ చేయలేదు అన్న తర్వాత ఇలా మాట్లాడటం ఎంత వరకు న్యాయం అనేది మీరు ఆలోచించుకోవాలి... అంటూ హేమ స్పందించారు.
పిచ్చి వేషాలుంటే నాగార్జున ఒప్పుకుంటారా?
నాగార్జునగారు చాలా పెద్ద మనిషి, చాలా బాధ్యతగల మనిషి, ఆయన మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాస్టింగ్ కౌచ్ లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఉంటే ఆయన ఈ షో చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారు? అని హేమ ప్రశ్నించారు.