బాబా భాస్కర్‌కు వెన్నుపోటు.. నమ్మక ద్రోహం అంటూ కంటతడి.. శ్రీముఖి ఓదార్పు

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 30 Highlights || Filmibeat Telugu

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 29వ రోజు మరోసారి సెలబ్రిటీల మధ్య వ్యక్తిగత విభేధాలు బయటపడ్డాయి. సోమవారం రెగ్యులర్ మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కావడంతో ఇంటి సభ్యులు తమకు నచ్చని వారిని, తమకు పోటీగా మారే సభ్యులను ఎలిమినేషన్‌కు నామినేట్ చేయడం జరిగింది. అయితే ఎలాంటి వ్యతిరేకత లేని బాబా భాస్కర్‌ను నామినేట్ అయ్యేల బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దాంతో తప్పనిసరి పరిస్థితిలో బాబా భాస్కర్ నామినేషన్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..

కుంకుమ పూసి నామినేట్

కుంకుమ పూసి నామినేట్

బిగ్‌బాస్ ఇంటిలో నాలుగో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌కు బిగ్‌బాస్ తెర తీశాడు. దానికి అవసరమయ్యే నామినేషన్ల ప్రక్రియను మొదలుపెట్టాడు. తాము నామినేట్ చేసే వ్యక్తికి కుంకుమ పూసి ఎలిమినేషన్ ప్రక్రియలోకి నెట్టాలని సూచించాడు. ఇలా ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కెప్టెన్ అలీ రెజాకు నామినేషన్ నుంచి రిలీఫ్ దక్కింది.

బాబా భాస్కర్‌కు అలీ షాక్

బాబా భాస్కర్‌కు అలీ షాక్

కెప్టెన్ కావడంతో అలీ రెజాను ఎలాంటి సంకోచం లేకుండా నామినేట్ కాని వ్యక్తుల్లో ఒకరిని నామినేట్ చేయాలని సూచించాడు. దాంతో అలీ ఇరుకున పడినట్టు కనిపించాడు. అంతలోనే తేరుకొని బాబా భాస్కర్‌ను నామినేట్ చేస్తున్నాని ప్రకటించారు. దాంతో ఒకింత బాబా షాక్‌కు గురయ్యాడు. ఎందుకు నామినేట్ చేశావని అడిగితే.. జస్ట్ టైంపాస్ అంటూ సమాధానమిచ్చారు.

నామినేట్ అయ్యింది వీరే

నామినేట్ అయ్యింది వీరే

తాజా వారంలో రాహుల్, పునర్నవి, హిమజ, అషురెడ్డి, శివజ్యోతి, బాబా భాస్కర్‌ నామినేషన్లలో ఉన్నారు. వీరందరికీ ఇంటి సభ్యులు రంగు పూసి నామినేట్ చేశారు. అలాగే చివరి వరకు బాబా భాస్కర్‌‌ను ఎవరూ నామినేట్ చేయకపోవడం నేరు బిగ్‌బాస్ రంగంలోకి దిగి ఝలక్ ఇచ్చాడు. కెప్టెన్ అలీ రెజాకు సూచన ఇచ్చి ఒకరిని నేరుగా నామినేట్ చేయమని పేర్కొన్నాడు.

తనకు తోచినట్టుగా శ్రీముఖి

తనకు తోచినట్టుగా శ్రీముఖి

ఇన నామినేషన్ తర్వాత శ్రీముఖి తనకు తోచినట్టు మాట్లాడింది. బాబా భాస్కర్‌ను ఉద్దేశించి ఆయనకు భాష సమస్య అంటూ వరుణ్, ఇతరులకు చెప్పింది. బాబా భాస్కర్ మంచి తనాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ కామెంట్ కూడా విసిరేసింది. ఓ గంట సేపు నన్ను వదిలేస్తే నేను కామ్ అయిపోతానని చెప్పారంటూ బాబాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది శ్రీముఖి.

బాబా భాస్కర్‌కు ఓదార్పు

బాబా భాస్కర్‌కు ఓదార్పు

బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్‌కు గురైన బాబా భాస్కర్‌ను శ్రీముఖి ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇది గేమ్. ఇందులో గెలువాంటే ప్రత్యర్థి అనే వాడిని నామినేట్ చేయాల్సిందే. రేపు గేమ్‌లో నీవు నాకు ప్రత్యర్థి అయినా నేను గెలిచేందుకు ప్రయత్నిస్తాను. నా స్వార్ధానికి నేను ఆడుతాను అంటూ శ్రీముఖి లెక్చర్ ఇచ్చింది.

టైంపాస్ కోసమా?

టైంపాస్ కోసమా?

కానీ ఏ పాపం చేయని తనను టైంపాస్ కోసం ఎలా నామినేట్ చేస్తాడంటూ బాబా భాస్కర్ కంటతడి పెట్టారు. ఇలా నమ్మక ద్రోహం చేసే వాళ్లను చూడటం ఇదే మొదటిసారి అంటూ పేర్కొన్నారు. నేను ఎవరికీ హానీ చేయకూడదని అనుకొంటాను. అలాగే ఇతరు కూడా నాతో అలానే ఉండాలని అనుకొంటాను అంటూ భోరున విలపించాడు. కానీ శ్రీముఖి ధైర్యం చెప్పి బాబాకు మనోధైర్యాన్ని ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X