బిగ్‌బాస్ నుంచి అవుట్ అయ్యేది వీరే? ఈసారి డబుల్ ధమాకా!
బిగ్‌బాస్ రియాలిటీ తెలుగు రెండో వారం ముగించుకోబోతున్నది. రెండో ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధమైంది. ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ సంచలనం రేపడంతో ఈ రియాలిటీ షోపై భారీగా నజర్ పెట్టారు. వారాంతం ఎలిమినేషన్‌కు నాగార్జున సిద్ధం కాగా, ప్రేక్షకులు ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఎనిమిది మందిపై ఎలిమినేషన్ కత్తి
రెండో ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారి సంఖ్య భారీగానే ఉంది. వరుణ్, వితిక, జాఫర్, హిమజ, రాహుల్, మహేష్, శ్రీముఖి, పునర్నవి మెడపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నది. దాంతో ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనే అంశం మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ సారి ఒకరు కాదు.. ఇద్దరు బయటకు వెళ్తున్నారనే విషయం ఆసక్తిగా మారింది.

డబుల్ ఎలిమినేషన్‌కు రెడీ
ప్రస్తుత వారాంతంలో బిగ్‌బాస్ షోలో సెన్సేషన్ క్రియేట్ కాబోతున్నది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నదనే మాట మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. అయితే ఎనిమిది మందిలో ఎవరా ఇద్దరు అనే ప్రశ్న ప్రేక్షకులను వెంటాడుతున్నది. ఈ సారి నాగార్జున ఇద్దరిని బయటకు పంపి.. మరో వైల్డ్ కార్డుకు తెర లేపే ప్రయత్నం చేస్తున్నారనేది సమాచారం.

ఈ సెలబ్రిటీలే సేఫ్
ప్రస్తుత వారాంతంలో ఎక్కువగా పునర్నవి భూపాలం, హిమజ సేఫ్ ప్లేస్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. వరుణ్ సందేశ్ కెప్టెన్ కావడంతో ఎలాంటి ముప్పు లేదు. శ్రీముఖి స్ట్రాంగ్ అభ్యర్తి కావడం ఆమె సేఫ్. అయితే ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్న వారిలో వరుణ్ సందేశ్ భార్య వితిక ఉన్నారు. అలాగే జాఫర్, రాహుల్ సిప్లిగంజ్‌పై కూడా కత్తి వేలాడుతున్నది. అందుకు కారణం వారిద్దరూ ఇంట్లో పెద్దగా ఫెర్ఫార్మ్ చేయకపోవడమే అనేది ప్రధాన కారణం.

ఎలిమినేషన్‌లో ఆ ఇద్దరు
రెండోవారం ముగింపునకు వచ్చేసరికి.. తక్కువ ఓటింగ్ జరిగిందనే మాట కూడా వినిపిస్తున్నది. అయితే ఈ సారి ఎలిమినేషన్ అయ్యేవారిలో వితిక ముందు వరుసలో ఉండగా, రెండో వ్యక్తి జాఫర్ గానీ, రాహుల్ గానీ ఉండొచ్చు అనేది స్పష్టంగా వినిపిస్తున్నది. అయితే వితిక, రాహుల్ గానీ, వితిక, జాఫర్ గానీ ఇంటి నుంచి వెళ్లే వారిలో ఉంటారనేది కచ్చితమైన సమాచారం. ఇంటి సభ్యుల తలరాతను ప్రేక్షకులు ఎలా డిసైడ్ చేశారో కొద్దిగంట్లోనే డిసైడ్ కాబోతున్నది.


Click it and Unblock the Notifications











