twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ నుంచి టాప్ సెలబ్రిటీ అవుట్? స్టార్ మాకు మరో షాక్.. మాస్‌గా వేదికపైకి నాగ్

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో తొలి వారాంతం హంగామాకు రంగం సిద్ధమైంది. బిగ్‌బాస్‌ ప్రారంభమైన వారం రోజులకే ఇంట్లో సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు, అభిప్రాయ బేధాలు పొడసూపాయి. ఈ క్రమంలో హోస్ట్‌గా నాగార్జునకు ఈ వారం భారీగానే పనిపెట్టినట్టు కనిపిస్తున్నాడు. తొలివారమే నాగార్జున చాలా సీరియస్‌గా వ్యవహరించాల్సి రావడంతో బుల్లితెర ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొన్నది. వివరాల్లోకి వెళితే..

    తొలివారంలోనే గందరగోళం

    తొలివారంలోనే గందరగోళం

    తొలివారంలోనే హేమ, రాహుల్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, మహేష్ విట్ట మధ్య భారీగా గొడవులు చేసుకొన్నాయి. మహేష్, వరుణ్ సందేశ్ మధ్య గొడవ కొట్టుకొనేంత వరకు వెళ్లింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ తరుఫున హోస్ట్ నాగార్జున ఎలాంటి క్లాస్ పీకుతారో వేచి చూడాల్సింది. నాగ్ ఇంటిలో చోటుచేసుకొన్న గొడవలపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది.

    ఆరుగురిపై ఎలిమినేషన్ కత్తి

    ఆరుగురిపై ఎలిమినేషన్ కత్తి

    మొదటి వారమే ఇంటి సభ్యులు జాఫర్, హేమ, పునర్నవి, వితిక, రాహుల్, హిమజ ఎలిమేషన్‌కు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఆరుగురిలో ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. మొదటివారం ఈ ఆరుగురిని వదిలేస్తారా? లేక వారిలో ఒకరు బయటకు వెళ్తారా అనే ప్రశ్నగా మారింది. అయితే ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే హేమ, వితిక బయటకు వెళ్లే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

     బిగ్‌బాస్‌కు గట్టి ఓటింగ్ షాక్

    బిగ్‌బాస్‌కు గట్టి ఓటింగ్ షాక్

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు గట్టి షాకే తగిలిందనే మాట మీడియాలో వినిపిస్తున్నది. గత మూడు సీజన్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ఓటింగ్ పోలైనట్టు సమాచారం. ఈ అంశం బిగ్‌బాస్ నిర్వాహకులు షాకింగ్‌గా ఉందంటూ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. తక్కువ ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఎవరు బయటకు వెళ్తారనేది మరో ప్రశ్నగా మారింది.

    సేఫ్ జోన్‌లో ఉన్నది ఎవరంటే

    సేఫ్ జోన్‌లో ఉన్నది ఎవరంటే

    మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. హిమజకు 35 శాతం ఓటింగ్ జరిగిందని, ఆ తర్వాత రాహుల్ దాదాపు 25 శాతం మేరకు ఓట్లు పోలైనట్టు సమాచారం. ఆ తర్వాత పునర్నవి, జాఫర్‌కు ఎక్కువగా ఓటింగ్ జరిగిందని సమాచారం. ఇక చివరి స్థానంలో వితిక, హేమపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతుందనే మాట బలంగా వినిపిస్తున్నది. హేమ ఎలిమినేట్ అవుతుందా లేదా ఎలిమినేషన్ నిలిపివేస్తాడా అనేది వేచి చూసే చూడాల్సిందే.

     మాస్.. మ.. మ మాస్ అంటూ నాగ్

    మాస్.. మ.. మ మాస్ అంటూ నాగ్

    ఇక వీకెండ్ షో కోసం నాగార్జున వీర మాస్‌గా వేదికపైకి వచ్చాడు. మాస్ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తూ హల్‌చల్ చేశాడు. మాస్ మాస్.. మ.. మ మాస్ అంటూ స్టెప్పులతో హడలెత్తించాడు. శనివారం వచ్చేసింది.. నేను వచ్చేసాను.. మీ అందరికి వినోదం పంచడానికి నేను వచ్చాను అంటూ నాగ్ హింట్ ఇచ్చారు.

    English summary
    Bigg Boss 3 season started with Nagarjuna as host. On day one, Shock for Sreemukhi, Baba Bhaskar. These along with some other celebraties nominated for elimination.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X