శ్రీముఖి ఓ సైకో.. ఎంతకైనా తెగిస్తుంది.. వితిక, పునర్నవి కుట్ర మొదలైంది!
Recommended Video
బిగ్‌బాస్ రియాలిటీ షోలో 16వ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో గొడవ ప్రభావం ఇంటిలో 17వ రోజు కూడా కొనసాగింది. గాయపడిన రవికృష్ణకు ప్రథమ చికిత్స జరిపించారు. టాస్క్ ప్రాపర్టీస్‌ను డామేజ్ చేయడానికి కారణం శ్రీముఖే అనే అంశాన్ని తెర మీదకు తెచ్చారు. కెప్టెన్సీ టాస్క్ విషయంలో బిగ్‌బాస్ తీవ్ర నిర్ణయం తీసుకొన్నారు. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

శ్రీముఖిని టార్గెట్ చేస్తూ
కెప్టెన్సీ టాస్క్‌లో రవికృష్ణ గాయపడటానికి కారణం శ్రీముఖి. ఆమె డంబెల్‌తో బాక్సును బద్దలు కొట్టడం వల్లనే రవికృష్ణ తాను చేత్తో గాజు బాక్సును పగలగొట్టాడు. శ్రీముఖి ఓ సైకో. టైటిల్ గెలువడానికి ఎంతకైనా దిగజారుతుంది అంటూ వితిక బ్యాచ్ ఓ పాయింట్‌ను లేవనెత్తింది. శ్రీముఖిని వితిక బ్యాచ్ టార్గెట్ చేస్తుందనే విషయాన్ని వివరంగా మహేష్ విట్ట చెప్పారు.

ఇంటి సభ్యులపై బిగ్‌బాస్ సీరియస్
ఇక ఇంటి సభ్యులతో బిగ్‌బాస్ సమావేశం నిర్వహించారు. సభ్యులు ఇంటి నిబంధనను యదేచ్ఛగా ఉల్లంఘింస్తున్నారు అని బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా కెప్టెన్ టాస్క్‌లో వస్తువుల ధ్వంస కావడానికి కారణం ఎవరు? అని బిగ్‌బాస్ ప్రశ్నించాడు. అందుకు జవాబుగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. శ్రీముఖి, రవికృష్ణ అని పేర్లు చెప్పాడు.

వచ్చేవారం శ్రీముఖి ఎలిమినేషన్‌కు నేరుగా నామినేట్
ఇంటి నిబంధనలు ఉల్లంఘించిన శ్రీముఖిపై బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేసినందుకు వచ్చేవారం ఎలిమినేషన్‌కు నామినేషన్ చేస్తూ శిక్ష విధించాడు. దాంతో వచ్చేవారం నేరుగా శ్రీముఖి నామినేట్ అయ్యారు. దీంతో ఇంటిలో వాతావరణం సీరియస్‌గా మారింది. అలాగే కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేస్తూ బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నాడు.

పునర్నవి, అలీ రాజాకి సీక్రెట్ టాస్క్
ఇక ఇంటిలోని అలీ రాజా, పునర్నవికి బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు తెలియకుండా ఓ ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్లాలని చెప్పాడు. బిగ్‌బాస్ ఆదేశం ప్రకారం సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అలీ రాజా అర్ధరాత్రి బెడ్ రూమ్ నుంచి ఓ డోర్ తీసుకొని ఓ కొత్త ప్రదేశానికి వెళ్లాడు. ఆ తర్వాత పునర్నవి అలానే చేసింది. ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో వారిద్దరూ తలదాచుకొన్నారు.

ఇంటి సభ్యులు త్యాగం చేస్తే వారిద్దరూ
ఇంటి సభ్యులు ఉదయం పాటతో నిద్రలేచి చూసే సరికి పునర్నవి, అలీ లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. ఇళ్లంతా వెతికినా లాభం లేకపోవడంతో వారిద్దరూ బయటకు పోయి ఉంటారనే విషయాన్ని చెప్పారు. ఈ ఇద్దరు ఇంట్లోకి రావాలంటే సభ్యులు కొన్ని అంశాలు త్యాగం చేయాలని కోరారు. వాళ్లు రావాలంటే చెప్పులు లేకుండా తిరుగాలి. పాలు, పెరుగు, ఎగ్స్ వెంటనే స్టోర్ రూమ్‌లో పెట్టాలని సూచించాడు.


Click it and Unblock the Notifications











