twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిగ్గు లేదురా, తూ అంటూ తమన్నా బండబూతులు.. పునర్నవికి షాకిచ్చిన బిగ్‌బాస్

    |

    బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్‌లో గత కొద్దిరోజులుగా ఇంట్లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకొన్నాయి. ఒకరికి ఇంకోకరికి మధ్య గొడవలు అప్పుడే మొదలయ్యాయి. పలువురు సెలబ్రిటీల మధ్య మధ్య మాటల యుద్ధం ఊపందుకొన్నది. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో తీవ్ర పరిణామాల కనిపించాయి. నామినేషన్ ప్రక్రియలో తమన్నా, పునర్నవి వ్యవహారం హాట్ హాట్‌గా కనిపించింది. వివరాల్లోకి వెళితే..

    నామినేషన్ ప్రక్రియలో హాట్ హాట్‌గా

    నామినేషన్ ప్రక్రియలో హాట్ హాట్‌గా

    ఎలిమినేషన్‌ కోసం జరిగే నామినేషన్ల ప్రక్రియ సమయంలో తమన్నా రచ్చ రచ్చ చేసింది. ఎవరినైనా నామినేషన్ చేయాలంటే వారి ముఖంపై ఓ ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కొందరు ఇంటి సభ్యులు నామినేషన్ ప్రక్రియలో తమన్నాను టార్గెట్ చేసుకొన్నట్టు స్పష్టమైంది. ఈ క్రమంలో యాక్టర్ రవికృష్ణ, యాంకర్ శ్రీముఖితో భారీగానే గొడవ పడినట్టు కనిపించింది.

    ఏయ్ ఆపేయ్.. సిగ్గులేదురా అంటూ

    ట్రాన్స్‌జెండర్ తమన్నాను నామినేట్ చేసేందుకు రవికృష్ణ ఆమె ముఖంపై ముద్ర వేశాడు. అనంతరం ఆమెను ఎందుకు నామినేట్ చేశాడనే విషయంపై స్పందిస్తూ.. ఒక తప్పు చేసి మళ్లీ వెంటనే సారీ చెబుతుంది అంటుండగా.. ఏయ్ ఆపేయ్.. సిగ్గులేదురా.. నాకు నేను ఉమ్మి వేసుకోవాలి.. నీలాంటి సపోర్ట్ చేసినందుకు అని అన్నారు. మధ్యలో వచ్చిన శ్రీముఖిని కూడా ఆడ్డుకొన్నది.

     పునర్నవి ఆవేశంతో సెల్ఫ్ నామినేషన్

    పునర్నవి ఆవేశంతో సెల్ఫ్ నామినేషన్

    నామినేషన్ సందర్భంగా పునర్నవి ఆవేశంతో ఊగిపోయింది. నేను ఓపెన్ కావడం లేదని నన్ను టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్దం కావడం లేదు. దాంతో మనస్తాపం చెందిన పునర్నవి ఆగ్రహంతో.. బిగ్‌బాస్.. నాకు నేను సెల్ఫ్ నామినేట్ చేసుకోంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

     పునర్నవికి బిగ్‌బాస్ షాక్

    పునర్నవికి బిగ్‌బాస్ షాక్

    పునర్నవి భూపాలం స్వయంగా నామినేట్ చేసుకోవడంపై తమన్నా అభినందించింది. గుడ్ బేబీ.. లవ్ యూ పునర్నవి అంటూ తమన్నా చప్పట్లు కొట్టింది. పునర్నవి చేసిన నిర్వాకంపై బిగ్‌బాస్ మండిపడ్డారు. నీవు చేసిన పనికి ఈ సీజన్‌ మొత్తం నేరుగా నామినేట్ చేయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ అన్నారు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగినట్టు కనిపించింది.

    English summary
    Bigg Boss 3 season started with Nagarjuna as host. On day one, Shock for Sreemukhi, Baba Bhaskar. These along with some other celebraties nominated for elimination. Hema out from the bigg boss show, This week Jaffar Babu goes out from the Show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X