నా పెళ్లాంను అవమానిస్తావా? మేమైనా దేడ్ దిమాక్ గాళ్లమా? వరుణ్ సందేశ్ ఫైర్
Recommended Video
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఐదో రోజు షోలో అవే గొడవలు కనిపించాయి. ముందు రోజు రాత్రి తన భార్య విషయంలో మహేష్ విట్టతో వరుణ్ సందేశ్ మధ్య జరిగిన పంచాయితీ ముదిరి పాకాన పడింది. మహేష్ చెప్పిన విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయే సరికి, బాబా భాస్కర్‌కు తన గోడును చెప్పుకొన్నాడు. దాంతో మెయిన్ హాల్‌లో మీటింగ్ పెట్టుకొని గొడవను పరిష్కరించుకొనేందుకు సమావేశంగా కాగా..

భార్యకు జరిగిన అవమానంతో
వరుణ్ సందేశ్ తన భార్యకు జరిగిన అవమానంపై బెట్టు విడువలేదు. మహేష్ విట్టతో వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. వరుణ్ సందేశ్ వేలెత్తి చూపుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా సారీ చెప్పాలని కొందరు సూచించగా.. సారీ చెప్పడానికి మహేష్ సిద్ధమయ్యాడు. అయితే తన తప్పు లేకున్నా సారీ చెప్పడానికి నేను రెడీ అన్నారు.

నీ సారీ.. నాకొద్దని రిజెక్ట్ చేసి..
మహేష్ సారీ చెప్పడానికి చెప్పిన కారణాన్ని వరుణ్ సందేశ్ భార్య వితిక అభ్యంతరం చెప్పింది. నీవు తప్పు చేయకపోతే సారీ చెప్పవద్దు. నాకు అవసరం లేదు వితిక స్పష్టం చేసింది. దాంతో మీరు పోండి అంటూ మహేష్ అనడాన్ని వితిక తప్పుపట్టింది. అంతేకాకుండా నేను ఎక్కడైనా ఉంటాను.. నీవెవరూ మీరు వెళ్లమనడానికి.. పొమ్మనడానికి అని వితిక ఫైర్ అయింది.

వరుణ్ సందేశ్ ఆగ్రహంతో
మహేష్, వితిక మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకోవడంతో వరుణ్ సందేశ్ మధ్యలో దూరాడు. మమల్ని దేడ్ దిమాక్ గాళ్లం అనుకొంటున్నావా? అంటూ వరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో నా మాట తీరు కొంచె రఫ్‌గా ఉంటుందని మహేష్ సమాధానం ఇవ్వగా.. అయితే నా ముఖం కామెడీగా ఉందా అంటూ వరుణ్ సెటైర్ వేశాడు.

సారీ చెప్పిన మహేష్ విట్ట
అనంతరం గొడవకు పరిష్కారం చెప్పేందుకు మహేష్ సిద్ధమయ్యాడు. వరుణ్ సందేశ్‌కు సారీ చెప్పి.. ఈ సమస్యను ఇంతటితో వదిలేద్దామని అన్నారు. వరుణ్‌ను కౌగిలించుకొని.. గుండెలకు హత్తుకొని.. ఇంతటితో ముగిద్దామన్నాడు. అయినా వరుణ్ బెట్టు వదల్లేదు. మనస్ఫూర్తిగా సరే అని చెప్పకుండా మహేష్‌ను వదిలించుకొన్నాడు.


Click it and Unblock the Notifications











