భలే దెబ్బకొట్టింది: అమాయకంగా శ్రీముఖి చేతిలో మోసపోయిన వరుణ్ సందేశ్
బిగ్ బాస్ రియాలిటీ షోలో గెలుపొందాలంటే ఎత్తులకు పై ఎత్తు వేయాలి, అవసరం అయితే ఎదుటివారిని బోల్తా కొట్టించాలి, కొన్ని సార్లు కుట్రలు కూడా పన్నాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా షోలో భాగమే. వీటిని శ్రీముఖి పర్ఫెక్టుగా ఫాలో అవుతోంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో గెలుపొందడానికి తాజాగా ఆమె వరుణ్ సందేశ్‌ను బోల్తా కొట్టించడం చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
బిగ్ బాస్ ఇచ్చిన ఓ టాస్కులో గెలుపొందాలంటే ప్రత్యర్థి టీం కంటే ఎక్కువ డబ్బు కూడబెట్టాలి. ఎవరి దగ్గరైతే ఎక్కువ మనీ ఉంటుందో వారే విజేతలు. దీంతో వరుణ్ సందేశ్‌ను మాటల్లో పెట్టిన శ్రీముఖి... అతడి జేబులో నుంచి డబ్బులు కొట్టేసి బోల్తాకొట్టింది. ఈ ఊహించని పరిణామంతో వరుణ్ షాకయ్యారు. ఈ కొట్టేసిన డబ్బు వల్ల శ్రీముఖి విన్నర్ అయిందా? లేదా? అనేది మంగళవారం రాత్రి ప్రసారం అయ్యే షోలో క్లారిటీ రానుంది.

గత రెండు సీజన్లతో పోలిస్తే... నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో... రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి అందరూ టాప్ సెలబ్రిటీలే కావడంతో ప్రేక్షకులు ఈ షోను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. విజయవంతంగా రెండు వారాలు పూర్తయిన ఈ షో ప్రస్తుతం 3 వారంలోకి ఎంటరైంది.
ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ విషయానికొస్తే.... తమన్నా, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, వితిక ఉన్నారు. ఈ ఐదుగురిలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లబోతున్నారు. మొదటి వారం హేమ, రెండో వారం జాఫర్ ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











