ఆమె కోసం బిగ్ బాస్ టైటిల్ వదలుకుంటా.. మేమంతా పిచ్చోళ్లమా అంటూ శ్రీముఖి ఫైర్
పదకొండో వారంలో నామినేషన్ టాస్కే పెద్ద రచ్చగా మారింది. రాళ్లే రత్నాలు అనే ఈ టాస్క్ లో ఒకరినొకరు తోసుకోలేక, వారి దగ్గరి నుంచి దాచుకోలేక ఎవరికి దొరికింది వారు ఉంచుకున్నారు. అయితే తక్కువ విలువున్నరాళ్లను పోగు చేయడంతో రాహుల్, వరుణ్, మహేష్, పునర్నవి నామినేషన్స్లోకి వచ్చారు.
నామినేషన్ నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకునే చాన్స్ ఇవ్వకుండా.. మెడల్ కోసం పోరాడాలని టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నామినేట్ అయిన నలుగురు తప్పా మిగతా వారు ఆ మెడల్ కోసం ఫైట్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. అందులో భాగంగానే నేటి ఎపిసోడ్లో మరో గేమ్ ఆడించనున్నాుడు బిగ్ బాస్.

ఈ గేమ్లో వితికా, అలీ రెజా, శివజ్యోతి, శ్రీముఖి పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని అలీ ఆడటం మానేసి.. శివజ్యోతికి సపోర్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఇదే విషయమై ఇంటి సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తన కోసం టైటిల్ కూడా వదులుకుంటావా? అంటూ శ్రీముఖి ఘాటుగా ఫైర్ కాగా.. అవునంటూ అలీ కూల్ గా రిప్లై ఇచ్చాడు. అయితే ఆడేవాళ్లమంతా పిచ్చోళ్లమా? అంటూ నిలదీసింది. ఇదంతా చూస్తుంటే నేటి ఎపిసోడ్ మంచి మజాగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











