Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పంచ్‌లతో అదరగొట్టిన బామ్మ.. రాహుల్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన శ్రీముఖి అమ్మ
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు ఇస్తోన్న ఫ్యామిలీ టచ్ నేటి ఎపిసోడ్లో ముగిసింది. వితికా సోదరి, అలీ భార్య, శివజ్యోతి భర్త, బాబా భాస్కర్ ఫ్యామిలీ, వరుణ్ బామ్మ, రాహుల్, శ్రీముఖి వాళ్ల అమ్మ... ఇలా అందరూ వచ్చేసి స్టార్లను ఇవ్వడంతో బిగ్‌బాస్ హోటల్ తిరిగి సెవెన్ స్టార్ హోటల్ అయిందని.. దీంతో టాస్క్ కూడా పూర్తయిందని తెలిపాడు.
పంచ్‌లతో అదరగొట్టిన బామ్మ
ఐదో అతిథిగా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ బామ్మ.. ఫుల్ జోష్‌తో అందర్నీ ఎంటర్టైన్ చేసింది. కంటెస్టెంట్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా వారికి పంచ్‌లు వేసింది. బిగ్‌బాస్‌ను ఫోటో పంపించమని, ఇంటికి రమ్మని అడ్రస్ కూడా చెప్పింది. టాస్క్‌లు బాగా ఇస్తున్నారని, అందర్నీ ఎంటర్టైన్ చేస్తున్నావని బిగ్‌బాస్‌ను పొగిడింది. కాస్త ఉదయాన్నే లేచినప్పుడు డ్యాన్సులు వేయమని వరుణ్‌కు సలహా ఇచ్చింది.
బామ్మ జోష్‌కు హౌస్మేట్స్ ఫిదా..
బిగ్ బాస్ చరిత్రలోనే ఆయన్ను ఇలా ఎవరూ అడిగి ఉండరు.. ఇంటికి రమ్మని పిలిచింది.. కనీసం ఫోటో అయినా పంపించమని అడిగిందని రాహుల్, అలీ, వరుణ్, బాబా ముచ్చటించుకున్నారు. టాస్కులు బాగా ఇస్తున్నాడని, మూడు సీజన్ల గురించి చెబుతోందని, టైమ్ ఎంత అడిగితే చెప్పలేదు.. దీపావళి ఎప్పుడంటే.. ఎప్పుడో ఒకప్పుడు అంటూ చెప్పిందని వితికా, శివజ్యోతి, శ్రీముఖి ముచ్చటించుకున్నారు.
టాస్క్‌లు బాగా ఆడు..
ఫ్రీజ్ మోడ్‌లో ఇంటి సభ్యులుండగా.. రాహుల్ వాళ్ల అమ్మ కన్ఫెషన్ రూమ్‌లో నుంచి పిలిచింది. అయినా సరే రాహుల్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. కొద్ది సేపటి తరువాత రిలీజ్ అని చెప్పాక.. కన్ఫెషన్ రూమ్‌లో వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లాడు. రాహుల్ మంచివాడని, మనసులో ఏం పెట్టుకోడు, బయటకు అనేస్తాడు..ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని అందర్నీ అడిగింది. పాటలు పాడుతూనే ఉండూ.. ఉన్నవి రెండు వారాలే టాస్క్‌లు సరిగ్గా ఆడమని సూచించింది. అనంతరం నాని సినిమాలోని పెదవే పలికిన మాటల్లోనే అనే పాటను పాడి..అమ్మకు అంకితం చేశాడు.
రాహుల్‌కు స్వీట్ వార్నింగ్..
ఇక చివరగా శ్రీముఖి.. తన తల్లి వస్తుందని ఎదురుచూసింది. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మధ్యలోనే వెళ్లమని చెప్పి..మళ్లీ అంతలోనే తిరిగి పంపించాడు. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ కోర్ట్ యార్డ్‌లోనే ముచ్చట్లు పెట్టుకున్నారు. ఎవర్నీ లోపలకు రానీయొద్దని వితికాతో చెప్పి పంపించింది. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించారు. అందరితో మాట్లాడేందుకు డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి.. మాట్లాడుకోండి.. పోట్లాడుకోవద్దు అంటూ రాహుల్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
లతా లతా అంటూ పరిగెత్తిన బాబా..
శ్రీముఖి అమ్మను చూసి బాబాకు ఏదో అయింది. పిచ్చిపిచ్చిగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు. మీరు బాగున్నారు అంటూ కాంప్లీమెంట్ ఇచ్చాడు. శ్రీముఖి తండ్రి రామకృష్ణ.. జిరాక్స్ తీశాడంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఇద్దరూ సేమ్ ఉన్నారంటూ కామెడీ చేశారు. దీంతో మిగతా హౌస్మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. చివరకు వెళ్లేటప్పుడు కూడా లతా లతా అంటూ పరిగెత్తుకెళ్లాడు.