అలీ రెజా ఏమైనా చచ్చిపోయాడా? ఎందుకలా ఏడుస్తున్నావు.. శివజ్యోతికి క్లాస్ పీకిన శ్రీముఖి

Recommended Video

Bigg Boss Telugu 3 : Episode 51 Highlights

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో 49వ రోజు వీకెంట్ ఎలిమినేషన్‌లో అలీ రెజా అవుట్ కావడంతో ఇంటి సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఊహించని పరిణామం ఎదురుకావడంతో శివజ్యోతి, శ్రీముఖి, రవికృష్ణతో సహా అందరూ దు:ఖంలో మునిగిపోయారు. ఆ విషాదం వారిని 50వ రోజు కూడా వెంటాడింది. 50వ రోజు ఉదయం వారు బాధతోనే లేచారు. కానీ ఆ తర్వాత వారి రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయి యధావిధి స్థానానికి వచ్చారు. ఇంతకు ఇంటిలో ఏం జరిగిందంటే..

అలీ రెజా ఎలిమినేషన్ ప్రభావం

అలీ రెజా ఎలిమినేషన్ ప్రభావం

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఉదయం ఇంటి సభ్యుల ముఖాల్లో అలీ రెజా ఎలిమినేషన్ ప్రభావం కనిపించింది. శివజ్యోతి నిద్ర నుంచి లేస్తూనే బెడ్‌పైనే అలీని తలచుకొని ఏడ్చింది. ఆ సమయంలో పునర్నవి వచ్చి శివజ్యోతిని ఓదార్చింది. ఇంట్లో నీవు ఇలా ఏడిస్తే అలీ బాధపడతాడు. కాబట్టి అలీ కోసమైనా నీవు ఏడుపు ఆపమని శివజ్యోతి చెప్పింది.

క్లాస్ పీకిన శ్రీముఖి

క్లాస్ పీకిన శ్రీముఖి

ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా శివజ్యోతి ఏడుపు ఆపలేదు. దాంతో శ్రీముఖి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలీ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అంతేగా దానికి ఏడ్వాలా? ఏదో వాడు చచ్చినట్టు ఎందుకు ఏడుస్తున్నావు. ఇలా నువు ఏడుపు ఆపకపోతే బయట అలీ బాధపడుతాడు అని శ్రీముఖి సీరియస్ అయింది. అలీ బయటకు వెళ్లడం నాకు షాకే.. తొందరగా బయటపడటం కష్టం అంటూ నార్మల్ అయ్యేందుకు ప్రయత్నించింది.

ఫన్నీ టాస్క్‌తో ఇంటి సభ్యులు

ఫన్నీ టాస్క్‌తో ఇంటి సభ్యులు

ఇంటి సభ్యులు నార్మల్ కావడానికి బిగ్‌బాస్ ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. శివజ్యోతి రిపోర్టర్‌గా, హిమజ కెమెరామెన్‌గా ఓ గేమ్ అడమని చెప్పాడు. దాంతో ఇంటి సభ్యుల మూడ్‌ను, ప్రవర్తన, వారికి సంబంధించిన విజువల్స్‌ను షూట్ చేయమని అడిగారు. దాంతో ఇంటి సభ్యులందరీని వారు షూట్ చేసి.. ఆ తర్వాత ఆ విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు.

నామినేషన్ ప్రక్రియ

నామినేషన్ ప్రక్రియ

ఇక సోమవారం ఎప్పటిలానే ఎలిమినేషన్‌కు నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ మొదలుపెట్టాడు. ఇంటి సభ్యుల ఫొటోలను ఓ టేబుల్‌పై పెట్టి.. దాని ముందు నిప్పుల కుంపటిని పెట్టాడు. తాము నామినేట్ చేసే ఇద్దరి వ్యక్తుల ఫోటోలను నిప్పులోవేసి కారణాలు చెప్పమన్నారు. అలా ఇంటి సభ్యులందరూ తమకు నచ్చని వ్యక్తుల ఇద్దరి ఫొటోలను మంటలో వేసి వారిని నామినేట్ చేశారు.

నామినేషన్‌లో వీరే...

నామినేషన్‌లో వీరే...

ప్రస్తుత వారానికి ముందుగా రాహుల్, శ్రీముఖి, రవిక‌ృష్ణ, పునర్నవి, మహేష్ విట్టా నామినేట్ అయ్యారు. అయితే నామినేట్ అయిన వారిలో నుంచి కెప్టెన్స్ పవర్స్ ఉపయోగించి ఒకరిని సేఫ్ చేయమని బాబా భాస్కర్‌ను అడిగాడు. దాంతో ఎక్కువ సేపు ఆలోచించకుండా టాస్క్‌లో నిజాయితీగా ఆడిన రవికృష్ణను బాబా సేఫ్ చేశాడు.

షాకిచ్చిన బాబా భాస్కర్

షాకిచ్చిన బాబా భాస్కర్

నామినేషన్ నుంచి రవికృష్ణను బాబా భాస్కర్ సేఫ్ చేయడంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. ముఖ్యంగా మహేష్ విట్ట, శ్రీముఖి అసంతృప్తికి లోనయ్యారు. తనను సేఫ్ చేస్తారని శ్రీముఖి ఆశించినట్టు.. దాంతో షాక్‌కు గురైనట్టు ఆమె ముఖ కవలికలు చెప్పాయి. కానీ తర్వాత సర్దుకొని రవికృష్ణను సేఫ్ చేసి బాబా భాస్కర్ సరైన నిర్ణయమే తీసుకొన్నాడని మహేష్, శ్రీముఖి చెప్పడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X