నువ్వేమైనా తోపువా?.. నీకు చేతగాదు.. నేనేమైనా వెధవనా.. రాహుల్, పునర్నవి ఫైట్
Recommended Video
బిగ్‌బాస్‌లో స్పెషల్ టాస్క్, కెపెన్సీ టాస్క్ హైలెట్‌గా నిలిచాయి. నిన్నటి రోజు బూట్లు తుడిచే టాస్క్ శ్రీముఖి, మహేష్, పునర్నవి కొనసాగించారు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఆసక్తిగా సాగింది. వరుణ్, జ్యోతి, రవికృష్ణ కెప్టెన్సీ టాస్క్‌లో సహాయం చేశారు. రాహుల్, పునర్నవి ఓ విషయంపై గొడవపడ్డారు. 52, 53 రోజు ఇంట్లో ఏం జరిగాయంటే..

మహేష్ బూట్ పాలిష్
ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే టాస్క్‌లో చెత్తగా ఆడినందుకు శిక్షగా ఇచ్చిన స్పెషల్ టాస్క్‌ను ఆడనంటూ మొండికేసిన పునర్నవి 52వ రోజు అదే తీరును కొనసాగించింది. మహేష్, శ్రీముఖి బూట్లు పాలిష్ చేస్తూ తమ పనిని ముగించే విషయంపై దృష్టిపెట్టారు. బాబా భాస్కర్ షూస్‌ను క్లీన్ చేసి ఇవ్వడంతో హ్యపీగా ఫీలయ్యాడు. మహేష్ చేతితో చేసినందున వేసుకోకుండా ఇంట్లో షో కేసులో పెట్టుకొంటాను అని బాబా భాస్కర్ అన్నారు.

దిగివచ్చిన పునర్నవి
ఇక ఇంటి సభ్యులు నచ్చ చెప్పడంతో పునర్నవి మెత్తపడింది. వరుణ్ సందేశ్ నచ్చజెప్పడంతో అలక దిగివచ్చిన పునర్నవి బూట్లు క్లీన్ చేసి పాలిష్ చేసే స్పెషల్ టాస్క్‌ను పూర్తి చేసింది. దాంతో స్పెషల్ టాస్క్ పూర్తి అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇంటి సభ్యులతోపాటు శ్రీముఖి, పునర్నవి, మహేష్ కూడా లగ్జరీ బడ్జెట్ టాస్క్ లభిస్తుందని చెప్పాడు.

రాహుల్, పునర్నవి చిలిపిగా
ఇక ఇంటిలో 53 రోజున రాహుల్, పునర్నవి మధ్య ,చిలిపిగా వాగ్వాదం జరిగింది. పెరుగుతో లస్సీ చేసి ఇవ్వవచ్చుగా అని రాహుల్ అడిగితే.. నీకు సర్వీస్‌లన్నీ కట్.. ఎలాంటి సేవలు లేవు అని పునర్నవి అంటే.. సేవలు పునరుద్ధరణకు ఏం చేయాలని వరుణ్ ప్రశ్న వేశాడు. అందుకు సబ్‌స్క్రిప్షన్ రీచార్జ్ చేయాలి అని రాహుల్ అన్నాడు. రీచార్జ్ ఎలా చేస్తావనే ప్రశ్నకు పునర్నవి ఘాటుగా స్పందించింది.

కెప్టెన్సీ టాస్క్
కెప్టెన్ ఎంపిక కోసం కొత్త రూల్‌ను బిగ్‌బాస్ పెట్టాడు. ఇప్పటి వరకు కెప్టెన్‌గా పనిచేయని వారికి అవకాశం ఇస్తానని చెప్పడంతో రేసులో శ్రీముఖి, హిమజ, మహేష్, వితిక, రవికృష్ణ నిలువగా.. వారిలో వితిక, శ్రీముఖి, మహేష్ పోటీ పడ్డారు. పోటీదారులు బరువులెత్తగలవా? జెండా పాతగలవా గేమ్ ఆడాలి.

కెప్టెన్సీ టాస్క్‌లో
బరువులెత్తగలవా? జెండా పాతగలవా గేమ్‌లో పోటీదారుడు ఒకరి వీపుపై ఎక్కి ఒకవైపు ఉన్న జెండాను తీసుకొని మరోవైపు పెట్టాలి. అలా ఎక్కువ జెండాలు పెట్టిన వ్యక్తి కెప్టెన్‌గా ఎన్నికవుతారు. రవికృష్ణ వీపుపై శ్రీముఖి, వరుణ్ వీపు వితిక, మహేష్ వీపుపై జ్యోతి ఎక్కి ఆట ఆడారు. ఈ గేమ్‌లో వితిక గెలిచి కెప్టెన్‌గా ఎన్నికైంది.

కెప్టెన్సీ టాస్క్‌పై గొడవ
కెప్టెన్సీ టాస్క్ విషయంపై రాహుల్, పునర్నవి మధ్య చిన్న గొడవ జరిగింది. రాహుల్‌ను ఉద్దేశించి నువ్వేమన్నా తోపువా అంటూ ప్రశ్నించింది. దాంతో రాహుల్ కూడా పునర్నవిపై ఫైర్ అయ్యాడు. నా పేరు ఎందుకు లేవనెత్తావు టాపిక్‌లో అంటూ నిలదీశాడు. ఆ తర్వాత పునర్నవి కాంప్రమైజ్ అయింది. కాఫీ తెచ్చి యాటిట్యూడ్ మార్చుకో అంటూ అని చెప్పింది.

రాహుల్ ఫైర్
అయితే ఈ గొడవ రాహుల్, పునర్నవి మధ్య కొనసాగింది. వితికను ఉద్దేశించి నీకు ఓటు వేసింది హౌలాగాడిని అయ్యానా అని రాహుల్ అంటే.. ఏం అనాలో అనేయ్ అంటూ వితిక సమాధానం ఇచ్చింది. అలా వితిక, రాహుల్ గొడవపై చర్చించుకొన్నాడు.


Click it and Unblock the Notifications











