twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వితిక మెడ మీద కత్తిపెట్టలే.. ఎందుకలా అరుస్తున్నావ్.. శ్రీముఖి, వరుణ్ బిగ్‌ ఫైట్

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Episode 54 Highlights || వితిక మెడ మీద కత్తిపెట్టలే.. అరుస్తున్నావ్ ఏంటి?

    బిగ్‌బాస్ రియాలిటీ షోలో శుక్రవారం (54వ) రోజున సందడి సందడిగా కనిపించింది. ఇంట్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొంటూ కనిపించారు. అలాగే హలో యాప్ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను స్పాన్సర్ చేసింది. ఈ టాస్క్ పేరు ఏమిటంటే సీక్రెట్ అండ్ లైస్. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులందరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తారు. పిలిచిన తర్వాత వారు బయటకు వచ్చి గదిలో జరిగిన విషయాలు వెల్లడిస్తారు. వాటిని నమ్మడోమో.. నమ్మకపోవడం బట్టి కరెక్ట్‌గా జవాబు చెబితే లగ్జరీ టాస్క్ కింద మంచి విందును ఏర్పాటు చేస్తారు. ఈ టాస్క్ సందర్బంగా వరుణ్ సందేశ్, శ్రీముఖికి గట్టిగానే గొడవ జరిగింది. అందుకు కారణమేమిటంటే..

     సీక్రెట్ అండ్ లైస్ టాస్క్‌లో

    సీక్రెట్ అండ్ లైస్ టాస్క్‌లో

    సీక్రెట్ అండ్ లైస్ టాస్క్‌లో భాగంగా బాబా భాస్కర్, రవికృష్ణ, హిమజ, వితిక, వరుణ్ సందేశ్, శ్రీముఖి, మహేష్ విట్టా అందరూ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లారు. బాబా భాస్కర్‌ను రూమ్‌లోకి పిలిచి ఏబీసీడీలు ముందు నుంచి వెనుకకు.. వెనుక నుంచి చెప్పమన్నాడు. 1 నుంచి 100 వరకు లెక్కించమంటే తప్పులుగా లెక్కించాడు. దాంతో అలా కామెడీని పండించాడు.

    రాహుల్ స్టోరీ ఇలా

    రాహుల్ స్టోరీ ఇలా

    ఇక రాహుల్ సిప్లిగంజ్‌ను కన్ఫెషన్ రూంలోకి బిగ్‌బాస్ పిలిచాడు. బయటకు వెళ్లి అమ్మతో ఫోన్‌లో మాట్లాడినట్టు.. పెళ్లి ఫిక్స్ అయినట్టు చెప్పి వారిని నమ్మించాలని చెప్పాడు. బయటకు రాహుల్ బయటకు వచ్చి.. అమ్మతో మట్లాడాను. ఆమె ఏడ్చింది. మేము పిల్లను చూస్తుంటే.. నీవు స్మోకింగ్ చేస్తూ మా పరువు పోతున్నది అని చెప్పాడు.

    రాహుల్ హార్ట్ బీట్ చెక్ చేసిన శ్రీముఖి

    రాహుల్ హార్ట్ బీట్ చెక్ చేసిన శ్రీముఖి

    దాంతో రాహుల్ చెబుతుంటే.. శ్రీముఖి వచ్చి హార్ట్ బీట్ చెక్ చేసింది. అందరూ నిజమే అని అంటూ చెబుతుంటే.. వరుణ్ నాకు నమ్మబుద్ది కావడం లేదు అని అన్నాడు. అందుకు సమాధానమిస్తూ.. రవికృష్ణ అమ్మ పేరుతో మోసం చేయడు. అంటే కరెక్ట్ చెప్పకపోతే బొక్క పడుతుంది అని శ్రీముఖి అన్నది.

    శ్రీముఖి జవాబుకు షాక్

    శ్రీముఖి జవాబుకు షాక్

    రాహుల్ సిప్లిగంజ్ చెప్పిన విషయం కరెక్ట్ అని ఇంటి సభ్యులు చెప్పగానే... బిగ్‌బాస్ తప్పు అన్సర్ అంటూ డిక్లేర్ చేశాడు. దాంతో శ్రీముఖితోపాటు అందరూ షాక్ తిన్నారు. ఇక శ్రీముఖిని బొక్క పడుతుందంటూ అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి తప్పు ఆన్సర్ చెప్పే విధంగా తప్పుదారి పట్టించందనే విధంగా వరుణ్ మాట్లాడటంతో శ్రీముఖి గట్టిగా జవాబిచ్చింది.

     బొక్క అనే మాటపై గొడవ

    బొక్క అనే మాటపై గొడవ

    వరుణ్ కామెంట్‌పై స్పందిస్తూ... బొక్క పడుతుందని నేను ఫ్లోలో చెప్పాను. అది నా లాంగ్వేజ్. నా అభిప్రాయం చెప్పాను. నేను ఎవరినీ ఇన్‌ఫ్లెయెన్స్ చేయలేదు. అందరి సమాధానం ప్రకారమే చెప్పామంటే.. బొక్క పడుతుందని చెప్పడం సరికాదు అని వరుణ్ అన్నాడు. అయితే నిర్ణయం మాత్రం అందరి ఇష్టానుసారమే జరిగిందని శిల్ప చక్రవర్తి చెప్పింది.

    నా భాష అంతే..

    నా భాష అంతే..

    వరుణ్ అభ్యంతరలపై శ్రీముఖి గట్టిగా సమాధానం చెప్పింది. బొక్క అనేది నా లాంగ్వేజ్ శ్రీముఖి అంటే.. మరి రాహుల్ లాంగ్వేజ్‌ను ఎందుకు తప్పుపడుతావు. రాహుల్ లాంగ్వేజ్‌పై మీకు అభ్యంతరం అని వరుణ్ అంటూ.. ఆ సందర్భం వేరు.. ఈ సందర్భం వేరు. దానిని.. దీనిని ఎలా కలుపుతున్నావు అని శ్రీముఖి బదులిచ్చింది.

    వితికను ఫోర్స్ చేయలేదు

    వితికను ఫోర్స్ చేయలేదు

    రాహుల్ అంశంపై వరుణ్‌పై శ్రీముఖి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. నా అభిప్రాయం చెప్పాను. నేను కెప్టెన్ కాదు. వితిక గొంతు మీద కత్తి పెట్టి చెప్పమని చెప్పలేదు అని శ్రీముఖి అంటే ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అని వరుణ్ కౌంటర్ ఇచ్చాడు. దాంతో నేను అరవడం లేదు. నా టోన్ లెవెల్ అది.. నీ టోన్ లెవెల్ అది. నా వాయిస్‌ ఫ్రీక్వెన్స్ అలా ఉంది అని శ్రీముఖి చెప్పింది.

    నేను అలానే అరుస్తా

    నేను అలానే అరుస్తా

    వరుణ్, శ్రీముఖి మధ్య గొడవ అలానే కొనసాగింది. నా గొంతు అలానే ఉంటుంది. నేను అలానే మాట్లాడుతాను. ఇంట్లో నేను ఎలా అరుస్తానో నీకు తెలుసు అని శ్రీముఖి పేర్కొన్నది. దాంతో నేను కూడా నాలాగే మాట్లాడుతాను అని వరుణ్ అంటే అలానే చేయి అంటూ శ్రీముఖి పేర్కొన్నది. ఆ తర్వాత వితికను ఉద్దేశించి వరుణ్ నన్ను ఎందుకు ఆపమంటున్నావ్ అంటూ వరుణ్ గట్టిగా దాబాయించాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులు వారించడంతో గొడవ సద్దుమణిగింది.

    English summary
    Bigg Boss 3 Telugu reality show 53 day with high emotional content. on 6th weekend funny, furious moments registred in the house. Latest elimination of Ali Reza given shock to television audience. On monday, Celebraties are in shock. But they overcome from that, participated in nomination for the Elimination.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X