ఆ ముగ్గురి తాట తీసిన నాగ్.. గేట్ తీసే ఉంది బయటకు వెళ్లని ఉగ్రరూపం.. బిగ్‌బాస్‌లోొకి స్పెషల్ గెస్ట్

బిగ్‌బాస్ రియాలిటీ షో హోస్ట్ నాగార్జున ఆగ్రహానికి సాక్ష్యంగా నిలిచింది. షో రూల్స్‌ను అతిక్రమించిన ఇంటి సభ్యులను నాగ్ ఏకి పారేశారు. ఒక్కొక్కరిని పేరు పెట్టి తాట తీసినంత పనిచేశాడు. ఎప్పుడూ పాట, డ్యాన్స్‌తో ఇంట్లోకి అడుగుపెట్టే నాగ్.. వాటన్నింటిని క్యాన్సిల్ చేసి ఇంటి సభ్యుల దుమ్ము దులిపేశాడు. అలాగే ఇంటిలోకి బాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్‌ను ఇంటిలోకి ఆహ్వానించారు. ఇంకా ఇంటిలో ఏం జరిగిందంటే..

మహేష్ విట్టాపై గరం

మహేష్ విట్టాపై గరం

ఇంట్లోకి వెళ్లగానే మహేష్ విట్టాపై తిట్ల వర్షం కురిపించారు. నీవు ఇన్విటేషన్‌పై వచ్చావా? ఆడిషన్ చేసి రాలేదా? నీవు ఇన్విటేషన్‌పై వచ్చి ఏం పొడుస్తున్నావు అంటూ నాగ్ ఊగిపోయారు. బిగ్‌బాస్ గేట్ తీయండి అనగానే బయటకు వెళ్లిపోయే గేట్ ఓపెన్ అయింది. ఆ తర్వాత గేట్ తీసే ఉంది.. ఛాయిస్ నీదే అంటూ ఫైర్ అయ్యాడు. దాంతో మహేష్ స్పందిస్తూ.. నేను సారీ చెప్పాను. టాస్క్ కూడా పూర్తి చేశాను అని అన్నాడు. అందుకే మిమిల్ని క్షమిస్తున్నానని నాగ్ అన్నాడు.

రాహుల్‌కు అభినందన

రాహుల్‌కు అభినందన

మహేష్‌ స్పెషల్ టాస్క్ ఆడే విధంగా చేసిన రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రశింసించాడు. శిక్ష కాకుండా నీకు టాస్క్ ఇస్తే ఆడే వాడి కాదా? ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు దానిపై గౌరవం ఉంచి పూర్తి చేయాలి అంటూ రాహుల్ అనడాన్ని నాగ్ ప్రస్తావించి ప్రశించాడు. నీవు స్మార్ట్‌గా ఆడుతూనే ఇతరులను స్మార్ట్‌గా ఆడిస్తున్నావని రాహుల్‌కు నాగ్ కితాబిచ్చాడు.

పునర్నవి నీ భాషేంటి

పునర్నవి నీ భాషేంటి

ఇక స్పెషల్ టాస్క్ ఆడనంటూ ముండికేసిన పునర్నవిని నాగ్ గట్టిగా మందలించాడు. అంతేకాకుండా నీవు మాట్లాడే భాష ఏంటి అని క్లాస్ పీకాడు. నేను మాట్లాడే మాటలు బీప్ వేసుకోమని చెప్పి.. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. టాస్క్ అంటే టాస్క్ మాదిరిగానే ఆడాలి. పునర్నవిని మెప్పించిన వరుణ్ సందేశ్‌ను నాగ్ అభినందించాడు. వితిక వల్లే అంత సహనం, ఓర్పు వచ్చిందా అని జోక్ వేశాడు.

శ్రీముఖి నీవేమైనా బిగ్‌బాస్‌వా?

శ్రీముఖి నీవేమైనా బిగ్‌బాస్‌వా?

ఇక బిగ్‌బాస్‌ రూల్స్‌ను వ్యతిరేకేంచిన మాట్లాడిన శ్రీముఖిని కడిగిపడేశాడు. ఇంటిలో ఆటను డిసైడ్ నీవు కాదు. గేమ్‌ను ఆడించేంది బిగ్‌బాస్. ఇంటికి బిగ్‌బాస్ నీవు కాదు. ఇంటి బాస్ బిగ్‌బాస్ అంటూ శ్రీముఖికి నాగ్ క్లాస్ పీకాడు. నీకు ఆడాలని లేకపోతే నీవు మానేయ్. ఇంకొకరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకు. నీ వల్ల గేమ్ స్పాయిల్ అయిందన్నారు. ఇంట్లో దెయ్యం నాకే భయం అనే టాస్క్‌ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లకుండా చేశావు. ఆ గేమ్‌లో ప్రతీకారం తీర్చుకొనే అంశాన్ని లేకుండా చేశావు అని శ్రీముఖికి క్లాస్ పీకాడు.

శ్రీముఖి నీవల్లే

శ్రీముఖి నీవల్లే

ఇంట్లో దెయ్యం నాకే భయం అనే టాస్క్‌లో మరో లెవెల్‌ మిస్ అయిందనే విషయాన్ని తెలుసుకొని ఇంటి సభ్యులు షాక్ గురయ్యారు. తన తప్పు లేదని చెబితే శ్రీముఖి కోసం వీడియోను ప్లే చేసి తను అన్న మాటలను వినిపించాడు. దాంతో నాగ్‌కు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హిమజ సేఫ్

హిమజ సేఫ్

ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో హిమజ, శ్రీముఖి, పునర్నవి, మహేష్ విట్ట, శిల్ప చక్రవర్తి నామినేషన్‌లో ఉండగా, ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు. ఒక్కొక్కరిని ఒక్కో గదిలోకి పంపించి ఎవరి డోర్ అయితే ఓపెన్ అవుతుందో వారు ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయినట్టు సంకేతం అని చెప్పాడు. తొలి వరుసలో హిమజ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X