twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పంది వెధవ.. దొంగ సచ్చినోడా.. పునర్నవి బూతుపురాణం.. రాహుల్ గ్రాండ్ ఎంట్రీ

    |

    Recommended Video

    Bigg Boss Telugu Season 3: Episode 65 Highlights

    బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన రాహుల్ మళ్లీ ఇంట్లోకి ప్రవేశించారు. రాహుల్ రాకతో ఇంటి సభ్యులు షాక్ గురయ్యారు. అలాగే ఈ వారానికి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇంకా ఇంటిలో ఏం జరిగిందంటే..

    బిగ్‌బాస్‌ టైటిల్ కొడుతా

    బిగ్‌బాస్‌ టైటిల్ కొడుతా

    బిగ్‌బాస్ రియాలిటీ షోలో 64వ రోజు ఉదయమే శ్రీముఖి, బాబా భాస్కర్ మధ్య వాడి వేడి చర్చ జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంతా అని సవాల్ విసురుకొన్నారు. బాబా భాస్కర్ తమిళంలో మాట్లాడితే తెలుగులో మాట్లాడాలని శ్రీముఖి సూచించింది. అలా వారి వాగ్వాదం కొనసాగి.. తమిళ బిగ్‌బాస్‌కు టైటిల్ కొడుతా అని ఛాలెంజ్ చేసింది.

    రాహుల్‌ను గుర్తు చేసుకొని పునర్నవి

    రాహుల్‌ను గుర్తు చేసుకొని పునర్నవి

    ఇక రాహుల్‌ను తలుచుకొని పునర్నవి బాధపడింది. పంది గాడు ఏం చేస్తున్నాడో అంటూ తిట్టుకొన్నది. వాడు ఇష్టం ఉన్నట్టు తింటుండొచ్చు.. నిద్రపోతుండొచ్చు. తనకు నచ్చిన పని చేస్తుండొచ్చు అని పునర్నవి పేర్కొన్నది. పునర్నవి మాటలు విని పక్కనే ఉన్న వరుణ్, వితిక నవ్వుకొన్నారు.

    బిగ్‌బాస్‌లోకి రాహుల్

    బిగ్‌బాస్‌లోకి రాహుల్

    పునర్నవి ఫీలింగ్స్‌ను సీక్రెట్ రూమ్‌లో నుంచి రాహుల్ గమనిస్తూ ఉన్నాడు. అలా చూస్తుండగా.. నీకు ఇంట్లోకి వెళ్లే సమయం ఆసన్నమైంది అని బిగ్‌బాస్ సూచించాడు. దాంతో రాహుల్ ఇంట్లోకి వెళ్లడానికి కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడి నుంచి ఇంగ్లీష్‌లో పాట పడటంతో పునర్నవితో సహా ఇంటి సభ్యులు షాక్ అయ్యారు.

    దొంగ సచ్చినోడా అంటూ

    దొంగ సచ్చినోడా అంటూ

    ఇంటి సభ్యులకు అలా షాక్ ఇస్తూ ఎగ్జిట్ గేట్ నుంచి లోనికి ప్రవేశించాడు. దొంగ సచ్చినోడా అంటూ ఎక్కడున్నావురా అంటూ పునర్నవి అంది. మెరుపు కలలు సినిమాలోని వెన్నెలవే వెన్నెలవే పాట పాడుకొంటూ వర్షంలో గొడుగుపట్టుకొని ఇంట్లోకి వచ్చాడు. అలా గ్రాండ్‌గా ఎంట్రీ వచ్చిన రాహుల్‌ను వితిక గట్టిగా వాటేసుకొన్నది. పునర్నవి సంతోషానికి ఇక అంతే లేకుండా పోయింది.

    నామినేషన్‌లో నలుగురు

    నామినేషన్‌లో నలుగురు

    ఆ తర్వాత ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇద్దరు ఇంటి సభ్యులు తమ వాదనలు వినిపించిన తర్వాత ఇంటి సభ్యులు ఎవర్నైనా ఒకరిని సేవ్ చేయాలి. అలాంటి గేమ్‌లో ఇంటి సభ్యుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఇంటి సభ్యులు నామినేట్ చేస్తే నామినేట్ కాని వ్యక్తి మరో వ్యక్తికి మిరపకాయ దండ వేయాలి. అలా ఈ వారం నామినేట్ అయిన వారిలో శ్రీముఖి, వరుణ్, రవికృష్ణ, బాబా భాస్కర్ ఉన్నారు.

    English summary
    Bigg Boss 3 Telugu reality show 64 day with high emotional content. Rahul simpliganj has entered into house. For this week, Sreemukhi, Varun Sandesh, Ravi Krishna, Baba Bhaskar nominated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X