అతి తెలివి ప్రదర్శించిన అలీ.. బొక్కబోర్ల పడ్డ శివజ్యోతి.. టాస్క్ ఆడనంటూ శ్రీముఖి ఫైర్
Recommended Video
బిగ్ బాస్ పదకొండో వారంలో టాస్కుల మీద టాస్కులు ఇస్తున్నాడు. కుళాయి కొట్లాట అంటూ హౌస్ మేట్స్ మధ్య పొట్లాట పెట్టేందుకు చూశాడు. అలీ, శివజ్యోతి మెడల్ టాస్క్ గురించి డిస్కషన్ చేశారు. వితికాకు.. వరుణ్, రాహుల్ హెల్ప్ చేస్తారు. బాబాకు మహేష్ చేస్తాడు.. మరి నీకు నాకు అని అంటుండగా.. నీకు నేను నాకు నువ్వు అనిఅలీ చెప్పాడు. మరి శ్రీముఖి పరిస్థితి ఏంటని శివజ్యోత ప్రశ్నించింది.

శ్రీముఖికి అలీ పంచ్..
వితికా, రాహుల్, వరుణ్, అలీ మాట్లాడుకుంటూ ఉండగా... మధ్యలో హిందీలో మాట్లాడిన అలీని తెలుగులోనే మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ హెచ్చరించాడు. దీంతో కెప్టెన్ అయిన శ్రీముఖి.. అలీ వద్దకు వచ్చి సీరియస్ గా చూసింది. శ్రీముఖి పడుకున్నది కనబడట్లేదా బిగ్ బాస్ అంటూ అలీ నిలదీశాడు. అయితే ఇదే విషయాన్ని కిచెన్లో ఉన్న బాబాతో చెప్పుకుంటూ.. శ్రీముఖి ఇంగ్లీష్ లో మాట్లాడింది. దీంతో బిగ్ బాస్ శ్రీముఖిని హెచ్చరించాడు.దీంతో అలీ వచ్చి.. కెప్టెన్ అయి ఉండి అలా చేస్తే ఎలా అంటూ పంచ్ వేశాడు.

బ్యాటిల్ ఆప్ మెడల్ లో ఫస్ట్ లెవెల్..
మెడల్ సాధించేందుకు గానూ కొళాయి కొట్లాట అనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన కంటెయినర్లో బకెట్తో వాటర్ నింపాల్సి ఉంటుంది. కంటెయినర్ లోపల స్మైలింగ్ బాల్ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ నీటితో నింపుతారో.. ఎవరి కంటెయినర్లో బాల్ ఎత్తులో ఉంటుందో వారు సెకండ్ లెవల్ కు వెళ్తారని తెలిపాడు.

అలీకి, శివజ్యోతికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్
అతి తెలివి ప్రదర్శించి అలీ బొక్కబోర్లా పడ్డాడు.. అతను పడటమే కాదు.. శివజ్యోతిని కూడా పడేలా చేశాడు. పోటీ దారులైన అలీ, శివజ్యోతి, వితికా, శ్రీముఖి, బాబాలు ఎవరి కంటెయినర్లో వారే నీటిని నింపాలనే నిబంధన ఉంది. కానీ అలీ కొంచెం ఎక్కువగా ఆలోచించి.. శివజ్యోతి కంటెయినర్లో వాటర్ నింపసాగాడు. శ్రీముఖి, వితికా ఆట ఆడమంటూ కూర్చున్నారు. అది కరెక్ట్ ఆట కాదు.. ఎవరి కంటెయినర్లో వారో నింపాలి.. అని సంచాలకులైన పునర్నవికి ఫిర్యాదు చేశారు.

దీంతో వీరిద్దరు
ఈ విషయాన్ని పునర్నవి బిగ్ బాస్ ద`ష్టికి తీసుకెళ్లింది. దీంతో అలీ, శివజ్యోతిలను టాస్క్ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించాడు. దీంతో వీరిద్దరు ఓ మూలన కూర్చుని ఉన్నారు. ఇక ఈ టాస్క్లో వితికా గెలిచినట్లు పేర్కొంది. ఇక పడుకునే సమయంలో అలీ, శివజ్యోతి టాస్క్లో జరిగిందాని గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. అందరూ సగం అటు సగం ఇటు ఆడుతున్నారంటూ మహేష్, వరుణ్, రాహుల్ గురించి మాట్లాడుకున్నారు.


Click it and Unblock the Notifications











