బాబాను తోసి అవతల పారేసిన అలీ.. షాకైన కంటెస్టెంట్లు.. ఫైనల్ టికెట్ కోసం రణరంగమే..
Recommended Video
బిగ్‌బాస్ షోలో చివరి అంకం మొదలైంది. ఇక మిగిలింది పట్టుమని పదిరోజులు కూడా లేదు. ఫైనల్‌కు టిక్కెట్టు కూడా ప్రకటించేశాడు బిగ్‌బాస్. నేరుగా ఫైనల్‌కు వెళ్లే చాన్స్‌ను ఎవరు మాత్రం వదులుకుంటారు. అందుకే హౌస్‌మేట్స్ ఎలాంటి టాస్క్‌లైనా చేసేందుకు సిద్దమయ్యారు.

నామినేషన్స్ లేదా ఫైనల్ టికెట్..
పద్నాలుగో వారంలో నామినేషన్ ప్రక్రియ కోసం టాస్క్‌లు పెట్టకుండా.. ఫైనల్ టికెట్ కోసం టాస్క్‌ను పెట్టాడు. దీంతో ఫైనల్ టికెట్ గెలిచిన ఇంటి సభ్యుడు తప్పా మిగిలన వారంతా నామినేషన్‌లో ఉంటారని బిగ్‌బాస్ తెలిపాడు. ఇక ఇంటి సభ్యులందరూ సమరమే అన్నట్లుగా సై అన్నారు.

అందరికంటే ముందున్న అలీ...
టాస్క్‌లంటే అందరికీ గుర్తొచ్చేది అలీనే. దానికి తోడు అదృష్టం కూడా అతని వెంటే ఉన్నట్లు కనిపిస్తోంది. కలర్ బాక్స్‌లను సెలెక్ట్ చేసుకోవడం.. అందులో 70శాతం రావడం.. శివజ్యోతిలో తిండిలో పోటీ పడటం.. ఇలా అన్నీ కలిసి వచ్చి టాప్‌లో నిల్చునేలా చేశాయి.

నేడు రసవత్తరంగా రెండో అంకం..
అయితే మొదటి లెవెల్ కాస్త ఈజీగానే ఇచ్చిన బిగ్‌బాస్ రెండో పార్ట్‌కు దుమ్ములేపినట్టు కనిపిస్తోంది. ఇద్దరికీ హోరాహోరీ పోటిని పెట్టినట్టు కనిపిస్తోంది. చివరకు వచ్చింది కదా అని హౌస్మట్స్ కూడా విజృంభిస్తోన్నట్లు కనిపిస్తోంది.

బాబాను ఒక్క తోపుతోసిన అలీ..
రెండో అంకంలో బాబా, అలీకి పోటీ పడ్డట్టు కనిపిస్తోంది. ఇక ఈ టాస్క్లో భాగంగా.. ఒకే తొట్టిలో ఇద్దరూ ఉండి.. వారికి సంబంధించిన పూల మొక్కను నాటాల్సి ఉంటుందని టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా వీరిద్దరి మధ్య తోపులాట జరుగుతోంది. ఈ క్రమంలో బాబాను ఒక్క తోపు తోయడంతో ఎగిరి అవతల పడ్డాడు. దీంతో హౌస్మేట్స్ కూడా షాక్‌కు గురయ్యారు. మరి చివరకు ఏమైందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.


Click it and Unblock the Notifications











