బాబా వంటపై అలీ కామెంట్లు.. గొడవ చేసేందుకు ప్రయత్నించిన శ్రీముఖి
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ పదమూడో వారంలో హీరోగా నిలిచింది ఇద్దరే ఇద్దరు. ఒకటి వరుణ్ బామ్మ.. ఇంకోటి బాబా భాస్కర్. బిగ్‌బాస్‌కు వచ్చిన అతిథులు తమ తమ కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇచ్చుకున్నారు. అయితే వరుణ్ బామ్మ మాత్రం కాస్త కొత్తగా ఆలోచించింది. అందర్నీ ఎంటర్టైన్ చేసింది. బిగ్‌బాస్ గురించి కుశల ప్రశ్నలు అడిగి.. ఇంటికి ఆహ్వానించింది.

హైలెట్ అయిన వరుణ్ బామ్మ...
అంతేకాకుండా ఫుల్ యాక్టివ్ మోడ్‌లో హస్మేట్స్‌కు పంచ్‌లు వేసింది. దీంతో సోషల్ మీడియాలో వరుణ్ బామ్మపై ప్రశంసల ఝల్లు కురిశాయి. ఇంటికి వచ్చిన ప్రతీ అతిథి మాట్లాడింది. బాబా భాస్కర్ వంట గురించి. ఇన్ని రోజులు ఎలా వంట చేశావ్.. చాలా బాగా చేస్తున్నావ్ అని అందరూ మెచ్చుకున్నారు.

ఇరానీ చాయ్‌తో పోలికలు..
అయితే ఇదే టాపిక్ సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. బాబా తాను చేసిన టీని ఇరానీ చాయ్‌తో పోల్చడం.. అది పెద్ద జోక్ అని అలీ అనడం.. ఇలా వీరిద్దరి మధ్య మాటలు కొనసాగుతుండగా.. ఇరానీ చాయ్‌తో పోల్చకండని అలీ అనడం.. పోలుస్తాను అంటూ బాబా అన్నాడు.
Recommended Video

ఈ విషయాన్ని పెద్దది చేసేందుకు శ్రీముఖి ప్రయత్నం..
అయితే ఇదే విషయంపై అలీ స్మోకింగ్ ఏరియాలో కూర్చుని మళ్లీ కామెంట్ చేయడం..మరోవైపు ఈ విషయాన్ని పెద్దది చేసేందుకు శ్రీముఖి ప్రయత్నం అన్నీ వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి ఆవేశంగా వచ్చి.. అలీ విషయాన్ని శివజ్యోతిని అడగడం... మీ అన్నే కదా అంటూ ప్రశ్నించడం.. బాబా మాష్టర్ వద్దని వారించడం.. బాబాపై శ్రీముఖి అరవడం.. ఇలా బాబా వంటలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
సోషల్ మీడియాలో కామెంట్లు..
ఇన్ని రోజులు బాబా వంటలు తిని.. ఇప్పుడు వంకలు పెడుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయన చేసింది మీకు నచ్చకపోతే.. మీరు వెళ్లి చేయండని కొందరు అంటుంటే.. ఆయన వంటగదిని రాడంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో శ్రీముఖి మళ్లీ ఏదో చిచ్చుపెట్టాలని చూస్తోందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











