బిగ్‌బాస్‌లో సందడే సందడి.. పునర్నవిని ఎత్తుకున్న రాహుల్
బిగ్‌బాస్ హౌస్ ముగిసేందుకు వచ్చింది. మిగిలింది ఈ ఒక్క రోజే. రేపటి ఎపిసోడ్‌లో నాగ్ వచ్చేస్తాడు.. వీకెండ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. టాప్5లో ఉన్న కంటెస్టెంట్లను బిగ్‌బాస్ ఈ వారం పెద్దగా కష్టపెట్టలేదు. వారి జర్నీకి సంబంధించిన వీడియోలను చూపించి ఎమోషనల్ అయ్యేట్టు చేశారు. ఇక నేటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లందర్నీ ప్రవేశపెట్టాడు. దీంతో హౌస్ అంతా సందడిగా మారినట్టు కనిపిస్తోంది.
హేమ, జాఫర్, తమన్నా, పునర్నవి ఇలా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లందర్నీ ఈ ఒక్క రోజు హౌస్‌లోకి పంపించినట్టు కనిపిస్తోంది. దీంతో మళ్లీ అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జాఫర్‌పై బాబా భాస్కర్ పంచ్‌లు వేశాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నావ్.. రెండో వారమే ఎలిమినేట్ అయ్యావ్ గుర్తు పెట్టుకో అంటూ కౌంటర్లు వేయసాగాడు.

తమన్నా మళ్లీ రవికృష్ణకు వదిలి పెట్టనట్టు కనిపిస్తోంది. ఏంటి అలా చూస్తున్నావ్ అంటూ రవికి కౌంటర్ వేయసాగింది. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న పునర్నవిని శ్రీముఖిని ఎత్తుకుని లోపలికి తీసుకొచ్చింది. లోపల ఉన్న రాహుల్.. పునర్నవిని ఎత్తుకున్నాడు. ఇదంతా చూస్తుంటే నేటి ఎపిసోడ్ మొత్తం కలర్‌ఫుల్ అయ్యేట్టు కనిపిస్తోంది.
లోపల ఎంట్రీ ఇచ్చిన ఈ కంటెస్టెంట్లందరికీ బయట జరుగుతున్న ట్రెండ్ గురించి తెలుసు కాబట్టి ఏమైనా లీక్ చేస్తారేమో చూడాలి. శ్రీముఖి, రాహుల్ ఓటింగ్‌లో దూసుకుపోతున్నారని.. వీరిద్దరికే విన్నర్ అయ్యే చాన్స్‌లు ఉన్నాయని ఎవరైనా చెబుతారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











