twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబా, రాహుల్ ఫ్యాన్స్ వార్.. బాబా లేకుంటే షోనే నడవదు.. తమిళ ఓట్లు అడుక్కుంటున్న ఫ్యాన్స్

    |

    నిన్నటి ఒక్క టాస్క్ సోషల్ మీడియాలో పెద్ద యుద్దానికి తెరలేపింది. డే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటూ అందరికీ ఒక్కో పాత్రను ఇచ్చి జీవించమన్నాడు. దీంతో గజినీ పాత్రలో అలీ, కాంచన క్యారెక్టర్‌లో రాహుల్, బాషా పాత్రలో బాబా ఇలా అందరికీ ఒక్కో ప్రత్యేక పాత్రను ఇచ్చాడు.

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Episode 90 Highlights || బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్
    రజీనీ స్టైల్లో దుమ్ముదులిపిన బాబా..

    రజీనీ స్టైల్లో దుమ్ముదులిపిన బాబా..

    క్యారెక్టర్ ఇచ్చిన మరుక్షణంలోనే.. బాషా, మాణిక్యం పాత్రల్లో జీవించాడు. స్టోర్ రూమ్ వద్దకు వెళ్లి బిగ్‌బాస్‌నే బెదిరించాడు. డోర్ మీరు తీస్తారా? నన్ను తీయమంటారా? నాకు ఇంకో పేరు ఉంది.. బాషా..ఈ బాషా ఒక్కసారిచెబితే వందసార్లు చెప్పినట్లే అంటూ బిగ్‌బాస్‌తో పరాచకాలు ఆడాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ మొత్తం బాబా నడిపించాడు. గజినీని ఆటో ఎక్కించడం, సావిత్రిగా ఉన్న శ్రీముఖిని నగ్మా అంటూ పిలవడం, కాంచనను బెదిరించడం ఇలా ప్రతీ మూమెంట్‌లో రజినీని దించేశాడు. దీంతో బాబా భాస్కర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    కాంచనగా అదరగొట్టిన రాహుల్..

    కాంచనగా అదరగొట్టిన రాహుల్..

    బిగ్‌బాస్ హౌస్‌ల్ టాస్క్‌ల పరంగా ఇంతవరకు తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు రాహుల్. అయితే పాటలు పాడుకుంటూ, మనసులో ఏం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వంతో రాహుల్‌కు క్రేజ్ పెరుగుతూ వచ్చింది. నిన్నటి ఎపిసోడ్‌లో కాంచనగా అదిరిపోయేట్టు స్టెప్పులేయడంతో రాహుల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ చిచ్చా పవరేంటో ఇప్పటికైనా తెలిసిందా? అంటూ ట్వీట్లు వేస్తున్నారు. టాస్క్‌లు చేయలేడు అనేవారికి చెంపపెట్టులాంటి పర్ఫామెన్స్ ఇచ్చాడని రాహుల్ ఫ్యాన్స్ అంటున్నారు.

    విజయ్ ఫ్యాన్స్‌ను ఓట్లు కోరడంతో..

    బాబా భాస్కర్‌కు ఓటు వేయాలని.. విజయ్ ఫ్యాన్స్‌ను సోషల్ మీడియా వేదికగా కోరాడో బాబా అభిమాని. దీంతో రచ్చ మొదలైంది. తమిళ నాడు ప్రజలను ఓట్లు అడుక్కుంటున్న బాబా ఫ్యాన్స్ అని కొందరు ట్వీట్లు చేయగా.. అలాంటి చీప్ ట్రిక్స్ రాహుల్ ఫాలోవర్స్‌కే తెలుస్తాయంటూ ఇంకొంత మంది ట్వీట్లేస్తున్నారు. ఆ ట్వీట్ బాబా ఫ్యాన్స్ చేయలేదని.. రాహుల్ ఫ్యాన్సే కావాలని ట్వీట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గట్టి వార్ జరుగుతోంది.

    బాబా లేకుంటే షోనే వేస్ట్..

    బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ అంటూ ఇచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బాబా భాస్కర్ ఒక్కరేనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. బాబా లేకుండా షోలో వినోదమనేదే ఉండదని అంటున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో బాబానే అందరి హృదయాలను కొల్లగొట్టేశాడని కామెంట్లు చేస్తున్నారు. రజినీ మ్యానరిజంతో ఎపిసోడ్ మొత్తాన్ని నడిపించేశాడని బాబా ఫాలోవర్స్ అంటున్నారు.

    English summary
    Bigg Boss 3 telugu 13th Week Updates, Baba Bhaskar As Baba, Rahul As Kanchana, Ali As Gajini, Sivajyothi As Chandramukhi, Srimukhi As Mahanati Keerthy Suresh, Varun And Vithika Bahubali Devasena Characted Palyed.. All Housemates Entertained Very Well. Baba Bhaskar And Rahul fans Social Media War Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X