బిగ్ బాస్ వింత టాస్క్.. బాబా, వితికాకు మండిపోయింది
బిగ్ బాస్ హౌస్లో పదకొండో వారం ఇంటిసభ్యులకు పెట్టిన టాస్కులు ఇంకా ముగిసిపోలేదు. నామినేషన్ ప్రక్రియ కోసం పెట్టిన రాళ్లే రత్నాలు టాస్క్ రెండు రోజుల పాటు కొనసాగింది. ఆ టాస్క్లో తక్కువ రాళ్లు ఏరిన రాహుల్, మహేష్, పునర్నవి, వరుణ్ నామినేషన్లోకి వెళ్లారు.
అయితే నామినేషన్ టాస్క్ పూర్తయిందనే లోపు..బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ అంటూ మళ్లీ టాస్కులను మొదలెట్టేశాడు. వాటి కోసం వితికా, శ్రీముఖి, శివజ్యోతి, బాబా, అలీ రెజా పోటీ పడ్డారు. కుళాయి కొట్లాట అంటూ వారి మధ్య పొట్లాట పెట్టేశాడు. అయితే ఈ ఆటలో అతి తెలివి ప్రదర్శించి అలీ రెజా చేతులు కాల్చుకున్నాడు. దీంతో శివజ్యోతికి కూడా నష్టం వాటిల్లింది. ఆ ఇద్దర్నీ టాస్క్ నుంచి బహిష్కరించాడు.

ఇక చివరగా వితికా గెలవడంతో.. ఆమె ఫైనల్ లెవల్ చేరుకుందని తెలిపాడు. మిగతా నలుగురికి మరో టాస్క్ ఇచ్చాడు. ప్రిజ్మా బ్యాలెన్స్ ఫ్రేమ్ అనే ఆటను ఆడించాడు. తలపై ఓ బ్లాక్ ను పెట్టి బ్యాలెన్స్ చేయాలనే ఈ టాస్క్లో.. బాబా భాస్కర్ చివరి వరకు నిలబడ్డాడు. ఇక బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్లో వితికా, బాబాలు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నారు. వీరిద్దరిలో హౌస్ మేట్స్ ఎవరికి మద్దతు తెలుపుతారో వారికి తిలకం దిద్దాలని, మిగిలిన వ్యక్తిపై కోడి గుడ్డు పగలగొట్టాలని తెలిపాడు. దీంతో మహేష్, శ్రీముఖి, శివజ్యోతి బాబాకు తిలకం దిద్దారు.. పునర్నవి, రాహుల్, వరుణ్ , అలీ వితికాకు తిలకం దిద్దారు.
ఇక ఈ మెడల్ ను నేడు ఎవరోకరు గెలిచేలా కనిపిస్తున్నారు. ఇందుకోసం వీరిని బాగా కష్టపెడుతున్నట్లు కనిపిస్తోంది. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రిక్షాలో కూర్చోవాలని, వానొచ్చినా వారు అక్కడే ఉండాలని.. పది పచ్చి మిరపకాయలు తినాలని టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అవి తినలేక.. వారికి మండినట్టు కనిపిస్తోంది. మరి చివరకు మెడల్ ను దక్కించుకునే వారెవరో చూడాలి.


Click it and Unblock the Notifications











