Don't Miss!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కన్నీరు పెట్టుకున్న బాబా.. టైటిల్ గెలవాలని లేదంటూ షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలీదు. ఎవరి మైండ్‌లో ఏముంటుందో పక్కవారికి తెలిసే చాన్సే ఉండదు. అప్పటి పరిస్థితికి తగ్గట్టుగా అవతివాళ్లు.. ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. అది వారి దృష్టిలో నిజమని భావించవచ్చు కానీ.. చివరకు ఏది కరెక్ట్ అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.
Recommended Video
చిచ్చు పెట్టిన ట్రాలీ టాస్క్..
అదే విధంగా మొన్నటి ట్రాలీ టాస్క్‌లో బాబా భాస్కర్ కావాలనే టార్గెట్ చేశాడని రాహుల్,వరుణ్,వితికా అనగా.. అలాంటిదేమీ లేదని బాబా చెప్పుకొచ్చాడు. అయితే చూసే జనాలకు మాత్రం అది నిజమేనని అనిపించినా.. బాబా మనసులోఉన్నది ఎవరికీ తెలీదు కదా. అదే విషయాన్ని మహేష్ కూడా మిగతా వారితో చెప్పాడు. అది నిజమో కాదో ఆయనకే తెలియాలి.. అయినా అది ఆయన గేమ్ కావచ్చు అంటూ డిస్కషన్ పెట్టాడు.
శ్రీముఖి సైగలు..
అయితే టాస్క్ జరిగే సమయంలో శ్రీముఖి సైగ చేయడం, అంతకు ముందే వీరంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, శ్రీముఖి, శివజ్యోతి, బాబా, అలీ ఒకవైపు నిల్చొవడం అనుమానాలకు దారితీస్తోంది. మధ్యలో డిస్కషన్ పెట్టుకుంటూ.. అంతగా డౌట్ ఉంటే మాష్టర్ ఇటు వస్తాడు.. నువ్వు అటు వెళ్లు అని మహేష్ అన్నాడు. కానీ దానికి మాత్రం బాబా ఆన్సర్ ఇవ్వలేదు. దాంతో ప్రేక్షకులకు అనుమానాలు వచ్చాయి.
టైటిల్ గెలవాలని లేదు..
నేను అలా నడపలేదు.. అవే అలా వెళ్లాయి.. చక్రాలను మనం కంట్రోల్ చేయలేం.. నా టార్గెట్ మొత్తం దానిపై ఉందంటూ బాబా భాస్కర్ ఏవేవో చెప్పుకొచ్చాడు. అయితే నేటి ఎపిసోడ్లో బాబాను ఇదే విషయంపై నాగ్ స్పందించినట్లు తెలుస్తోంది. ఆ టాస్క్‌ను గుర్తుచేస్తూ.. దానిపై క్లారిటీ ఇవ్వమన్నట్లు కనిపిస్తోంది. దీంతో బాబా కంటతడి పెట్టాడు. తాను కేవలం టాస్క్ ఆడటానికే వచ్చాను.. స్ట్రాటజీలు తెలియవని.. టైటిల్ కూడా గెలవాలని లేదంటూ చెప్పుకొచ్చాడు. చివరకు ఏమైందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.