రన్నరప్‌గా నిలిచినా.. ఆ విషయంలో శ్రీముఖిదే పైచేయి.. సోషల్ మీడియా టాక్

బిగ్‌బాస్ మూడో సీజన్ పూర్తి అయింది. ఇప్పటి వరకు వారి మధ్య అది జరిగింది.. షోలో అలా జరిగింది.. నాగార్జున ఇలా చేశాడు.. అనే అప్డేట్స్ వస్తుండేవి. అయితే బిగ్‌బాస్ మూడో సీజన్‌కు రాహుల్ విన్నర్‌గా నిలిచాడు.. శ్రీముఖి రన్నర్‌గా మిగిలిపోయింది. టాప్2లో ఉంటాడనుకున్న వరుణ్ సందేశ్.. అనూహ్యంగా నాల్గో స్థానానికి పరిమితమయ్యాడు. ఈ విషయం ఆయన ఫాలోవర్స్ ఒకింత మింగుడుపడని అంశమే. రాహుల్, వరుణ్‌లో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ కావాలని ఎంతో మంది కోరుకున్నారు. కానీ వారి కోరిక పూర్తిగా నెరవేరలేదు. రాహుల్ అయితే విజేతగా నిలిచాడని కానీ వరుణ్ మాత్రం నాల్గో స్థానంలోనే ఉండిపోయాడు.

 సెలెబ్రేషన్స్‌లో మునిగిన విన్నర్, రన్నర్

సెలెబ్రేషన్స్‌లో మునిగిన విన్నర్, రన్నర్

బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన హౌస్ నుంచి బయటకు వచ్చిన రాహుల్‌ను ఆయన అభిమానులు చుట్టుముట్టారు. ర్యాలీలు తీస్తూ వెళ్లామని, ఇంటి చుట్టు కూడా అభిమానులు పోగయ్యారని, గోడ దూకి మరి వెళ్లానని రాహుల్ చెప్పుకొచ్చాడు. అయితే విన్నర్‌గా నిలిచిన రాహుల్ కంటే.. రన్నర్ అయిన శ్రీముఖి హడావిడి ఎక్కువైంది. రాహుల్ కంటే శ్రీముఖే ఎక్కువగా సెలెబ్రేట్ చేసుకుంటోన్నట్లు టాక్.

వితిక, పున్ను, వరుణ్‌లతో కలిసి పార్టీ..

వితిక, పున్ను, వరుణ్‌లతో కలిసి పార్టీ..

టైటిల్ గెలిచి ట్రోఫీ అందుకున్న అనంతరం ఆ రాత్రే తామంతా కలుసుకున్నామని రాహుల్ తెలిపాడు. వరుణ్, వితికా, పునర్నవి కలిసి పార్టీ చేసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇక అందరూ సెలెబ్రేషన్స్‌లో మునిగి ఉండగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. విన్నర్‌గా నిలిచిన రాహుల్ కంటే.. రన్నర్‌గా నిలిచిన శ్రీముఖికే ఎక్కువ మొత్తంలో ముట్టిందని, మరో కంటెస్టెంట్‌కు విజేతగా నిలిచిన వారి కంటే ఎక్కువగా అందిందని తెలుస్తోంది.

అత్యధికంగా శ్రీముఖికే..

అత్యధికంగా శ్రీముఖికే..


హౌస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లందరి కంటే శ్రీముఖికే ఎక్కువ పాపులారిటీ ఉందన్న సంగతి తెలిసిందే. టీవీ షోలో వ్యాఖ్యాతగా చేస్తూ నిత్యం బిజీగా ఉండే శ్రీముఖిని.. బిగ్‌బాస్ హౌస్‌లోకి రప్పించేందుకు పెద్ద మొత్తంలోనే చెల్లించినట్టు తెలుస్తోంది. రోజుకు 1.5లక్ష చొప్పున ఎన్ని రోజులు ప్రయాణం సాగితే అన్ని రోజులకు చెల్లించేట్టు ఒప్పందం చేసుకున్నట్లు టాక్. ఈ లెక్కన శ్రీముఖికి విన్నర్ కంటే ఎక్కువగానే ముట్టిందని సమాచారం. వరుణ్ సందేశ్‌కు సైతం రోజుకు లక్ష చొప్పున కోటి వరకు చెల్లించారని తెలుస్తోంది. అయితే విన్నర్‌గా నిలిచిన రాహుల్‌కు మాత్రం వీరిద్దిరి కంటే తక్కువగానే ముట్టింది.

నాగ్ డీల్‌కు ఒప్పుకోని కంటెస్టెంట్లు..

నాగ్ డీల్‌కు ఒప్పుకోని కంటెస్టెంట్లు..

ప్లాన్ ఏ, ప్లాన్ బీ అంటూ టాప్ 5 కంటెస్టెంట్లను డబ్బు చూపి ఆశను పెంచాడు నాగ్. అయినా వారెవరు ఆసక్తిని చూపలేదు. చివరగా టాప్2లో ఇద్దరే మిగలగా.. రాహుల్, శ్రీముఖిలకు మరో ఆఫర్ ఇచ్చాడు. చెరో 25లక్షలు ఇస్తానని, అప్పుడు ఇద్దరూ సమానం అవుతారని, ఇక విజేత అనే వారుండరని డీల్ మాట్లాడాడు. అలా చేస్తే ఓట్లు వేసిన వారిని కించపరిచినట్లు అవుతుందని, అలా చేయలేమని తిరస్కరించారు. డబ్బు ముఖ్యం కాదు.. పేరు ముఖ్యం.. టైటిల్ గెలిస్తే వచ్చే కిక్కే వేరని తెలుసు కాబట్టి వారు ఆ డీల్‌ను రిజెక్ట్ చేశారు. డబ్బుదేముంది.. ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు.. కానీ వారి ప్రేమను ఈ డబ్బుతో డీల్‌తో పోల్చలేమని రాహుల్ చెప్పుకొచ్చాడు. టైటిల్ గెలిచామన్న పేరు ముందు డబ్బు కనబడదు కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X