twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పునర్నవి కోరికను తీర్చిన ఫ్యాన్స్.. బిగ్‌‌బాస్‌లో పడిన వికెట్ ఎవరిదంటే..

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Mahesh Vitta Out From Bigg Boss || పునర్నవి కోరికను తీర్చిన ఫ్యాన్స్

    బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్, ఎలిమినేషన్ అనేది నిరంతర సాగే ఓ ప్రక్రియ. ఒకరు ముందు ఒకరు వెనక.. అందరూ వెళ్లాల్సిందే. చివరకే ఒక్కరు మాత్రమే విన్నర్ అవుతారు.. ఈ సత్యం లోపల ఉన్న కంటెస్టెంట్లకు తెలిసినా.. టైటిల్ గెలిచేందుకు అందరూ ఆడతారు.. అందరూ కష్టపడుతారు. కానీ చివరకు గెలిచేది ఒక్కరే. ఈ మూడో సీజన్ అయిపోయేందుకు సమయం కూడా దగ్గరపడుతోంది. ఇంకొకరు ఇంటిని వీడే సమయం కూడా వచ్చేసింది.

    ఫలించిన పునర్నవి ప్రచారం..

    ఫలించిన పునర్నవి ప్రచారం..

    పదకొండో వారంలో ఎలిమినేట్ అయిన పునర్నవి.. పన్నెండో వారంలో నామినేషన్‌లోకి వచ్చిన తన స్నేహితులను కాపాడమని, వారికి ఓట్లు వేయమని అభిమానులను కోరింది. వారిని సేవ్ చేయడంటూ మద్దతుగా ప్రతీరోజు పోస్ట్‌లు చేసింది. లైవ్‌లోకి వచ్చి మరీ వారికి మద్దతును తెలిపింది. అయితే పునర్నవి కష్టం ఫలించింది. వారిద్దరూ సేవ్ అయ్యారు.

    మహేష్ అవుట్...

    మహేష్ అవుట్...

    అవును.. నిజమే. ఈ వారంలో మహేష్ ఎలిమినేట్ అయినట్లు లీకు వీరులు స్పష్టం చేసేశారు. గతవారమే మహేష్ ఎలిమినేట్ అయినట్లు చెప్పగా.. చివరకు పునర్నవి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈసారి మాత్రం మహేష్ పక్కాగా ఎలిమినేట్ అయ్యాడనే పక్కా సమాచారాన్ని మోసుకొచ్చారు.

     ట్రాలీ టాస్క్‌ వల్ల నామినేషన్‌లోకి..

    ట్రాలీ టాస్క్‌ వల్ల నామినేషన్‌లోకి..

    ట్రాలీ టాస్క్‌లో సరిగా పార్క్ చేయలేక వరుణ్, వితికా, మహేష్, రాహుల్ నామినేషన్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ మెడాలియన్ అనేది లేకుంటే.. వితికా కూడా నామినేషన్‌లో ఉండేది.. ఎలిమినేట్ అయి ఇంటికి పోయేది. మెడల్ గెలుచుకోవడంతో ఈ వారం నామినేషన్ నుంచి బయటపడింది.ఇక మిగిలిన ముగ్గురిలో వరుణ్, రాహుల్‌కు గట్టి ఫాలోయింగ్ ఉండటంతో.. మహేష్ నిష్క్రమించడం తప్పని సరైంది. మరి ఈ విషయాన్ని నాగ్ అధికారింగా ప్రకటించే వరకు చూడాలి. చివరి వరకు బిగ్‌బాస్ ఇంకా ఏదైనా ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి.

    English summary
    Bigg Boss 3 Telugu 12th Week Updates, mahesh Vitta eliminated From House. Buzz Is That He Got Less Vote Among Rahul And varun.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X